Guppedantha Manasu: ఒకరి చేయి ఒకరు పట్టుకున్న జగతి, మహేంద్ర.. షాకైనా దేవయాని, రిషి!

Navya G   | Asianet News
Published : Feb 26, 2022, 11:09 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu). ఈ సీరియల్ లో ప్రతిరోజు సరికొత్త ట్విస్ట్ లతో కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
19
Guppedantha Manasu: ఒకరి చేయి ఒకరు పట్టుకున్న జగతి, మహేంద్ర.. షాకైనా దేవయాని, రిషి!

రిషి, జగతి కలిసి మాట్లాడుతూ ఉంటారు రిషి షార్ట్ ఫిలిం ప్రోగ్రామ్ ను చూడటానికి మినిస్టర్ గారు వస్తున్నారు. అందుకని మీరు మహేంద్ర భూషణ్    గారికి దూరంగా ఉండమని ఇది సహాయం అనుకోండి మేడమ్ అని చెప్తాడు. దాంతో బాధపడుతూ ఉంటుంది జగతి.
 

29

రిషి మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు మీ ఇద్దరి చనువు కారణంగా అనేక ప్రశ్నలు మొదలవడం నాకు ఇష్టం లేదు, వాటికి నేను సమాధానం చెప్పలేను అంటూ జగతి తో చెప్తాడు. ఇక రిషి వెళుతూ నాది ఒక చిన్న రిక్వెస్ట్ మేడమ్ అనగానే వెంటనే జగతి రిషి మనసును చదివినట్టుగా ఈ విషయాన్ని మహేంద్ర సార్ కి చెప్పను అంటుంది. ఇదేనేమో తల్లి పేగు బంధం అంటే.
 

39

ధరణి, దేవయాని కాలేజ్ లో జరిగే షార్ట్ ఫిలిం ప్రోగ్రామ్ చూడటానికి  వస్తూ ఉంటారు. ధరణి తనకు ఎక్కడ ఎదురు తిరుగుతుందో అని ధరణి ని పొగుడుతూ ఉంటుంది దేవయాని. ఇక కాలేజీలో జరిగే ఏర్పాట్లను చూపిస్తారు.
 

49

వసుధర వేదికను అలంకరిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది.ఈ లోపు గౌతమ్ వచ్చి నాకు కూడా ఏమైనా పనులు చెప్పు వసుధార నన్ను దూరంగా పెట్టొద్దు అంటాడు. పుష్ప రోజా బొకే ని మహేంద్ర,జగతీ లకు ఇవ్వడానికి తీసుకు వెళుతూ ఉంటుంది.గౌతమ్ ఆ బొకే నుంచి ఒక రోజా పువ్వును తీసుకుంటాడు.
 

59

ఇక దేవయాని, ధరణి కాలేజ్ దగ్గరికి వస్తారు. మహేంద్ర జగతిని మినిస్టర్ గారిని ఆహ్వానించడానికి రమ్మని పిలుస్తాడు. కానీ జగతి రిషి అన్న మాటలు గురించి  ఆలోచిస్తూ నేను రాను అంటుంది. కానీ మహేంద్ర జగతి చేయి పట్టుకొని తీసుకెళ్తుండగా ఇక అక్కడే ఉన్న దేవయాని షాక్ అయి అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

69

ఇక రిషి కూడా జగతి మహేంద్ర లను చూసి షాక్ అవుతాడు. పుష్ప వచ్చి రోజా బొకే ను మహేంద్ర,జగతికి ఇస్తుంది దాంతో మినిస్టర్ గారి దగ్గరికి ఇద్దరూ బయలు దేరుతారు. గౌతమ్, వసుధర కు రోజా పువ్వును ఇస్తాడు వసుధర కూడా పువ్వును తీసుకుంటుంది.
 

79

ఇక రిషి అక్కడికి రావడంతో వసుధర షార్ట్ ఫిలిం ప్రోగ్రాం సక్సెస్ కావాలి అని రిషికి షేకండ్ ఇస్తుంది. దాంతోపాటు గౌతమ్ ఇచ్చిన రోజా పువ్వు ను రిషికి ఇస్తుంది. దీంతో గౌతమ్ నేనిచ్చిన పువ్వుని రిషి కి ఇస్తుంది అని ఫీల్ అవుతాడు. ఇక గౌతమ్ జగతి మేడం, మహేంద్ర అంకుల్ మినిస్టర్ గారి దగ్గరకు వెళ్లారు నువ్వు వెళ్ళవా అన్నగానే రిషి ఫీల్ అయ్యి వసుధర ఇచ్చిన పువ్వును తిరిగి గౌతమ్ కి ఇస్తాడు.
 

89

దాంతో గౌతమ్ భూమి గుండ్రంగా ఉండడం అంటే ఇదేనేమో నేను ఇచ్చిన పువ్వు నా దగ్గరికె వచ్చింది అనుకుంటాడు. దేవయాని బయట నిలబడి ఉంటుంది. రండి పెద్దమ్మ లోపలికి వెళ్దాం అనగా రిషి కి ఫోన్ రావడంతో గౌతమ్ కి పెద్దమ్మ కి కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు.
 

99

 ఇక వసుధారా తాడు అందుకోవడం కోసం పైకి ఎగురుతూ  ఉంటుంది. వసుధార దగ్గరికి వచ్చిన రిషి.     వసుధార అలా ఎగురుతుండగా వెనుక నుంచి వచ్చి ఎత్తుకొని వసుధర కు సహాయం చేస్తాడు. ఇదంతా అక్కడికి వచ్చిన గౌతమ్ చూసి షాక్ అవుతాడు. ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories