ప్రస్తుతం టాలీవుడ్‌లో `ప్రశాంత్`ల మేనియా సాగుతుంది. ప్రశాంత్‌లే ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని రూల్ చేస్తున్నారు. నెల రోజుల పాటు టాలీవుడ్‌ని ఊపేశారు. టీవీ నుంచి సినిమా వరకు `ప్రశాంత్` సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు వారి పేరే అటు సోషల్ మీడియాలో, ఇటు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. టీవీ రంగంలోనూ బాగా వినిపిస్తుంది. డిజిటల్‌ని బాగా ప్రభావితం చేస్తుంది. మరి ఆ `ప్రశాంత్` ల కథేంటి? వాళ్లు రూల్ చేస్తుందేంటి? అనేది ఓ సారి చూస్తే.
ఇటీవల `సలార్` సినిమా సంచలన విజయం సాధించింది. ఇది ఏడు వందల కోట్లకుపైగా వసూలు చేసింది. ప్రభాస్ సత్తా ఏంటో చూపించింది. నార్త్ లో `డంకీ` వంటి పెద్ద అడ్డంకి ఉన్నప్పటికీ ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు పంచింది. మంచి కలెక్షన్లని సాధించింది. అయితే వెయ్యికోట్లకుపైగా కలెక్షన్లని ఆశించినా, డంకీ ప్రభావం కారణంగా ఈ మూవీకి కలెక్షన్లు తగ్గిపోయాయి. లేదంటే ఈజీగా వెయ్యి కోట్లు దాటేది. అయితే ఈ మూవీని రూపొందించిన దర్శకుడు `ప్రశాంత్` నీల్. `కేజీఎఫ్` తో సంచలనాలు క్రియేట్ ప్రశాంత్ నీల్.. `సలార్`తో మరోసారి మ్యాజిక్ చేశాడు. తెలుగు సినిమాకి ఇయర్ ఎండ్‌లో ఊపిరి పోశాడు. జోష్ నింపాడు.
సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన సంచలనాలు సృష్టిస్తుంది `హనుమాన్`మూవీ. హనుమంతుడి ఎలిమెంట్లతో వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికే రెండు వందల కోట్లు దాటింది. మూడు వందల కోట్ల దిశగా వెళ్తుంది. తేజ సజ్జా వంటి అప్‌కమింగ్ హీరో సినిమా స్టార్ హీరోల సినిమాలను మించి కలెక్షన్లని సాధించడానికి, ఈ మూవీ ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి కారణం చిత్ర దర్శకుడు `ప్రశాంత్` వర్మ. ఆయన మ్యాజిక్ ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కి చేరుకుంది. ఓ రకంగా ఈ మూవీకి అసలైన హీరో ప్రశాంత్ వర్మనే అని చెప్పొచ్చు.
ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ పెద్ద తెరని సేక్ చేస్తే, పల్లవి ప్రశాంత్ బుల్లితెరని షేక్ చేశాడు. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో సాధారణ కంటెంస్ట్ లాగా వచ్చి అదరగొట్టాడు. రాను రాను తన విశ్వరూపం చూపించాడు. షో మధ్యలోకి వచ్చేసరికి హౌజ్‌లో కింగ్ అయిపోయాడు. టాస్క్ లు, నామినేషన్లలో దుమ్ము రేపి ఆకట్టుకున్నారు. రైతు బిడ్డ ట్యాగ్‌తో అందరికి దగ్గరయ్యాడు. ఏకంగా టైటిల్ విన్నర్‌గా నిలిచి అందరికి షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ షో తర్వాత ఆయన పేరే మారు మ్రోగింది. ఫ్యాన్స్ వివాదంలోనూ ఆయన పేరే రచ్చ చేసింది. ఏ బిగ్ బాస్ విన్నర్ పేరు వినిపించనంతగా ఊపేసింది.
ఇలా ఇటు బుల్లితెరపై పల్లవి ప్రశాంత్, అటు పెద్ద తెరపై ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మలు దుమ్ము రేపారు. ఈ ముగ్గురు `ప్రశాంత్`లే కావడం విశేషం. అలా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఈ `ప్రశాంత్` ల రచ్చ మామూలు కాదని చెప్పొచ్చు. అయితే ఈ ముగ్గురు నెల రోజుల పరిధిలోనే హంగామా చేయడం విశేషం. మొదట పల్లవి ప్రశాంత్ `బిగ్ బాస్`తో ఊపేశాడు. ఆ షో అయిపోయిన ఐదు రోజులకే ప్రశాంత్ నీల్ `సలార్` వచ్చింది. ఇక నెల లోపే `హనుమాన్` వచ్చింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని శాషించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ వ్యాప్తంగా `ప్రశాంత్` పేరు సందడి చేయడం విశేషం.