టికెట్ల కోసం గొడవ, `దేవర` రాత్రి షోలు రద్దు, అక్కడ ఏమాత్రం సత్తా చాటలేకపోతున్నా ఎన్టీఆర్‌ ?

First Published | Sep 26, 2024, 9:36 PM IST

`దేవర` ఫలితం మరికొన్ని గంటల్లో తేలబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి పలు బ్యాడ్‌ న్యూస్‌లు వినిపిస్తున్నాయి. షోలు రద్దు చేయడం, ఇతర స్టేట్స్ లో బుకింగ్స్ డల్‌గా ఉండటం షాకిస్తుంది. 
 

టాలీవడ్‌లో ఇప్పుడు అంతా `దేవర` ఫీవర్‌ నడుస్తుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావడం, భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కావడం, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా విడుదల కాబోతుండటం విశేషం. రెండు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతుంది. మరికొన్ని గంటల్లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి ఇన్నేళ్ల వెయిటింగ్‌ కి తెరపడబోతుంది. ఇక ఫలితం ఎలా ఉంటుందో కొన్ని గంటల్లోనే తేలనుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

`దేవర` సినిమాపై మొదట్నుంచి నెగటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. హైప్‌తోపాటు నెగటివ్‌ అంశాలు కూడా దాన్ని చుట్టుముట్టుతున్నాయి. ట్రైలర్‌తోనే సినిమాపై కిక్‌ పోయింది. యాక్షన్‌ అంశాలు బాగున్నాయి. విజువల్స్ బాగున్నాయి. కానీ కంటెంట్‌ పరంగా కొత్తగా లేదనే టాక్‌ వినిపించింది. పాత ఎన్టీఆర్‌ సినిమాలను తలపించేలా ఉందనే ట్రోలింగ్‌ నడిచింది.

కథేంటో అర్థమైపోవడంతో సినిమా ఏముంటుందనే వాదన వినిపిస్తుంది. మరోవైపు రాజమౌళితో `ఆర్‌ఆర్‌ఆర్‌` చేసిన తర్వాత ఎన్టీఆర్‌ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ కూడా ఆపాదిస్తున్నారు. ఇవన్నీ `దేవర`పై నెగటివ్‌ వైబ్స్ కి కారణమవుతుందని చెప్పొచ్చు. 
 


ఈ నేపథ్యంలో ఇప్పుడు రాత్రి షోలు రద్దు కావడం గమనార్హం. టికెట్ల కోసం మధ్యవర్తుల అత్యుత్సాహం కారణంగా ఏకంగా సినిమా షోలనే రద్దు చేశారట. సినిమాపై హైప్‌ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి బెనిఫిట్‌ షోస్ కి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అర్థరాత్రి ఒంటి గంట నుంచే షోస్‌ పడబోతున్నాయి. హైదరాబాద్‌లో ముప్పైకి పైగా థియేటర్లలో రాత్రి షోలు పడుతున్నాయి. ఫ్యాన్స్ డిమాండ్‌ మేరకు షోస్‌ పెంచినట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 500లకుపైగా షోస్‌ పడబోతున్నాయట. తాజాగా టీమ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. 

ఇదిలా ఉంటే కూకట్‌ పల్లిలో భ్రమరాంబ థియేటర్లో మాత్రం ఈ షోలను రద్దు చేశారట. మల్లీఖార్జున, భ్రమరాంబ థియటర్లలో ప్రీమియర్‌ షోలను రద్దు చేసినట్టు యాజమాన్యం బోర్డులు పెట్టింది. అర్థరాత్రి 1 ఏఎం షోలను ప్రదర్శించడం లేదు అని తెలిపింది. అయితే కారణాలేంటనేది చూస్తే, రెండు థియేటర్లలో టికెట్స్ అన్నీ మేమే కొంటాం అని కొంత మంది అడిగారని, కానీ థియేటర్‌ నిర్వాహకులు నో చెప్పారు.

తామే ఫ్యాన్స్ కి టికెట్లు అమ్ముతామని సిబ్బంది చెప్పడంతో వాగ్వాదం జరిగిందని, ఇది ఇద్దరి మధ్య గొడవకి కారణమై చివరికి షోలనే రద్దు చేసినట్టు సమాచారం. దీంతో షో లేదు అంటూ బోర్డు లు పెట్టారు. ఈ రెండు థియేటర్లలో తప్ప మిగిలిన థియేటర్లలో యదావిధిగా షోలు రన్‌ కానున్నాయి. 

మరోవైపు `దేవర` సినిమాకి మరో పెద్ద షాక్‌ తగిలినట్టు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకుపోతున్న ఈ సినిమా ఇతర స్టేట్స్ లో మాత్రం ఏమాత్రం సత్తా చాటలేకపోతుంది. హిందీలో బుకింగ్స్ చాలా డల్‌గా ఉన్నాయట. థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయని, ఉన్న థియేటర్లో కూడా అంతా ఖాళీగానే ఉన్నాయని ఒక్క స్క్రీన్‌ కూడా ఫుల్‌ కాలేదని తెలుస్తుంది.

బుక్‌ మై షోలో చూస్తే అన్ని స్క్రీన్లలో చాలా వరకు ఖాళీలే కనిపిస్తున్నాయి. ఇది పెద్ద షాకిస్తుంది. హిందీలోనే కాదు, తమిళంలోనే అదే పరిస్థితి. కార్తీ నటించిన `సత్యం సుందరం` మూవీ కి మంచి బజ్‌ ఉన్న నేపథ్యంలో థియేటర్లన్నీ దానికే కేటాయించారని, కొన్ని మాత్రమే `దేవర`కి ఇచ్చారట. ఆ స్క్రీన్లలోనూ చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఫుల్‌ గా ఒక్క స్క్రీన్‌ కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. కర్నాటక, కేరళాలోనూ సేమ్‌ పరిస్థితి అని తెలుస్తుంది. 

ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తో సత్తా చాటాడు. హిందీతోపాటు, ఓవర్సీస్‌లోనూ దుమ్ములేపారు. ఈ మూవీ నార్త్ లోనూ మంచి కలెక్షన్లని సాధించింది. కానీ ఆ ప్రభావం ఇప్పుడు `దేవర` విషయంలో కనిపించడం లేదు. బుకింగ్స్ లో అది ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తే తప్ప అక్కడ సినిమా పుంజుకోవడం కష్టం.

`పుష్ప` లాగా నెమ్మదిగా పికప్‌ అందుకుంటుందా? లేక ఫస్డ్ డేనా డీలా పడిపోతుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన `దేవర` చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా చేశారు. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ మూవీ రేపు శుక్రవారం(సెప్టెంబర్‌ 27)న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!