Krithi Shetty: లవ్‌ బెలూన్స్ తో ప్రేమ బాణాలు గుచ్చుతున్న `ఉప్పెన` భామ.. ఎరుపెక్కిన అందాలు అదరహో

Published : Feb 15, 2022, 03:17 PM IST

`ఉప్పెన` భామ కృతి శెట్టి వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమని తీసుకొచ్చింది. రెడ్‌ డ్రెస్‌లో, లవ్‌ షేప్‌ బెలూన్స్ తో ఫోటోలకు పోజులిచ్చింది. కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ బాణాలు గుచ్చుతుంది. 

PREV
16
Krithi Shetty: లవ్‌ బెలూన్స్ తో ప్రేమ బాణాలు గుచ్చుతున్న `ఉప్పెన` భామ.. ఎరుపెక్కిన అందాలు అదరహో

యంగ్‌ సెన్సేషన్‌ కృతి శెట్టి అభిమానులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపింది. అందుకు తనలోనూ ప్రేమని నింపుకోవడం విశేషం. లవ్‌కి కేరాఫ్‌గా నిలిచే రెడ్‌ కలర్‌ లవ్‌ బెలూన్స్ మధ్య, రెడ్‌ టాప్‌ ధరించి ఎరుపెక్కిన అందాలతో ఇంటర్నెట్‌లో ఘాటు రేపుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు రేపుతుంది. 

26

కృతి శెట్టి అందాలకు ఇప్పటికే ఫిదా అయిన కుర్రాళ్లు తాజాగా ఆమెని ఇలా చూసి మరింతగా పిచ్చెక్కిపోతున్నారు. క్యూట్‌నెస్‌, హాట్‌నెస్‌ మిక్స్ అయిన సరికొత్త అందాలతో గిలిగింతలు పెడుతూ కృతిశెట్టి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే కుర్రాళ్లకి పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

36

కృతి శెట్టి అంటే ఇప్పుడు టాలీవుడ్‌కి బంగారు బాతులా మారిపోయింది. ఆమె సినిమా చేసిందంటే చాలు అది హిట్టే అనేలా మారింది. `ఉప్పెన` చిత్రంతో స్టార్ట్ అయిన ఆమె సక్సెస్‌ జర్నీ ఇప్పుడు మూడు సినిమాల వరకు విజయవంతంగా సాగుతుంది. వరుసగా విజయాలతో గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంటుంది. క్రేజీ స్టార్‌గా అవతరించి యంగ్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది కృతి శెట్టి. 

46

ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతూ నటించిన `ఉప్పెన` చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే కోట్లాది తెలుగు ఆడియెన్స్ హృదయాలను దోచుకుంది కృతి శెట్టి. ఇందులో ఆమె బేబమ్మగా చేసిన హంగామా మామూలు కాదు. 

56

ఆ తర్వాత నానితో కలిసి `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇందులో ఆమె రోల్‌ పెద్దగా లేకపోవడం గమనార్హం. మరోవైపు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన `బంగార్రాజు` చిత్రంలో చైతూకి జోడి కట్టి మెప్పించింది. లక్కీ ఛార్మ్ గా మారింది. 

66

ప్రస్తుతం కృతి శెట్టి.. సుధీర్‌బాబుతో కలిసి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే సినిమా చేస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు నితిన్‌తో `మాచెర్ల నియోజకవర్గం`, అలాగే రామ్‌పోతినేనితో `ది వారియర్` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది కృతిశెట్టి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories