హీరోయిన్‌గా దేత్తడి హారిక.. హీరో ఎవరో తెలుసా..?

Published : Oct 30, 2023, 01:05 PM IST

యూట్యూబర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. సెలబ్రిటీగా ఎదిగింది అలేఖ్య హారికా. మరీ ముఖ్యంగా దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. ఇక తాజాగా ఆమె  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.   

PREV
15
హీరోయిన్‌గా దేత్తడి హారిక..  హీరో ఎవరో తెలుసా..?

హారిక అలేఖ్య.. యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయ్యింది. చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలంగాణ భాషలో ఆమె కామెడీ స్కిట్లు చేస్తూ బాగా అలరించింది. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యింది. దీంతో ఈ భామకి బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం అందుకుంది.
 

25

యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత ఫేమస్ అయింది ఈ తెలంగాణ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యూట్యూబ్ లోనే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సిరీస్ లు చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది.

35

బిగ్‌ బాస్‌ 4లో పాల్గొని రచ్చ చేసింది హారిక అలేఖ్య. ఎత్తులో చిన్నదే అయినా గట్టిదే. తన టాలెంట్‌ చూపించింది. హాట్‌ అందాలతో, అద్భుతమైన ఆటతో రఫ్ఫాడించింది. మేల్‌ కంటెస్టెంట్లకి దీటుగా ఆడుతూ వారిని డామినేట్‌ చేస్తూ హౌజ్‌లో రచ్చ రచ్చ చేసింది. అడపాదడపా తన అందాల విందు చేస్తూ యూత్‌ ఆడియెన్స్ కి ట్రీట్‌ ఇచ్చిందీ బ్యూటీ. 
 

45

Santosh Shoban

ఇక తాజాగా అలేఖ్య హారిక  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా యంగ్ హీరో సంతోష్ శోభన్  కు జంటగా నటించబోతుందంట.  అలేఖ్య హారిక హీరోయిన్ గా, సంతోష్ శోభన్ హీరోగా కొత్త సినిమా మొదలవ్వనుంది. ఈ సినిమాని బేబీ నిర్మాత SKN, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కలిసి నిర్మించనున్నారు. 

55

అయితే ఈసినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే షూట్ మొదలవ్వనుందని సమాచారం. ఇన్నాళ్లు.. హీరోయిన్ గా తెరపై తనను తను చూసుకోవాలి అనుకున్న హారిక.. ఇన్నాళ్లకు తన కలను నెరవేర్చుకోబోతుంది

click me!

Recommended Stories