మలయాళ బ్యూటీ అమలాపాల్ (Amala Paul) ప్రస్తుతం తన కెరీర్ ను వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం మలయాళ చిత్రాల్లోనే నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తన పర్సనల్ లైఫ్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. 2014లోనే దర్శకుడు ఏల్ విజయ్ ని పెళ్లి చేసుకుంది. మూడేళ్ల కాపురం తర్వాత విడాకుల తీసుకుంది. అప్పటి నుంచి సింగిల్ గానే జీవితం గడుపుతూ వచ్చింది.
రీసెంట్ గా రెండో పెళ్లి సిద్ధమైనట్టు ప్రకటించింది. తన ప్రియుడు జగత్ దేశాయ్ (Jagat Desai)ని పరిచయం చేస్తూ సర్ ప్రైజ్ చేసింది. అతని బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది. వేలికి ఉంగరాన్ని ధరించి తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.
అయితే ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను అమలాపాల్ అభిమానులతో పంచుకుంది. ప్రియుడితో కలిసి ఫొటోలకు రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులతో ఆకట్టుకుంది. ట్రెండీ వేర్స్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్న అమలాపాల్ కాబోయే భర్తతో కలిసి క్యూట్ గా స్టిల్స్ ఇచ్చింది.
మరోవైపు ప్రియుడిని ముద్దుల్లో ముంచేసిన ఫొటోస్ నూ షేర్ చేసుకుంది. లిప్ లాక్ చేస్తూ.. ప్రియుడి కౌగిలో బంధి అయిన పిక్స్ ను కూడా పంచుకుంది. ఈ రొమాంటిక్ ఫొటోలనూ షేర్ చేస్తూ అమలా పాల్ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది.
‘జీవితకాలం కలిసి ఉండాలనే జరిగిన పార్టీ నుంచి.. మా ప్రేమ కథను తెలియజేస్తున్నాను’. అంటూ ఈ ఫొటోలను పంచుకుంది. ఇక జీవితంలో మళ్లీ పెళ్లిచేసుకోబోతుండటంతో అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. లేటెస్ట్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.