చలపతిరావు ఆస్తుల విలువ ఇన్ని కోట్లా.. నిజంగా ఆశ్చర్యమే!?

First Published Dec 25, 2022, 10:32 AM IST

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు ఈ ఉదయం కన్నుమూయడంతో సినీలోకం విచారం వ్యక్తం చేస్తోంది. అయితే, యాబై ఏండ్ల పాటు అలరించిన చలపతిరావు ఆస్తుల వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.
 

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు (Chalapathi Rao) నిన్న రాత్రి ఎనిమిది గంటలకు గుండెపోటుతో మరణించారు.  78 ఏండ్ల వయస్సులో కన్నుమూశారు. తెలుగు చిత్రసీమలో విలన్, కామెడీ పాత్రలు పోషించడంతో ప్రసిద్ది చెందారు. 
 

1966లో  తెలుగు తెరకు పరిచయం అయిన ఆయన 600కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. చలపతిరావు ఆంధ్రప్రదేశ్‌లోని బలిపర్‌కు చెందినవారు. ఆయన కుమారుడు రవిబాబు కూడా టాలీవుడ్‌లో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకుంటున్న విషయం తెలిసిందే.
 

యాబై ఏండ్లకు పైగా ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో అలరించిన చలపతి రావు ఆస్తుల వివరాలు షాకింగ్ ఉన్నాయి. ఇన్నేండ్లలో చలపతిరావు సంపాదించింది కేవలం రూ.20 కోట్లు అని తెలుస్తోంది. అదీ ఆయన పేరుమీదున్న రెండిండ్లకు సంబంధించిన విలువగా తెలుస్తోంది. సీనియర్ నటుడిగా అంతకుమించి మరే ఇతర ప్రాపర్టీస్ లేకపోవడం పలువురు ఆశ్చర్యకరమే అంటున్నారు.

నటుడిగానే  కాకుండా.. నిర్మాతగానూ చలపతిరావు కొన్నిచిత్రాలను నిర్మించారు. ఏకంగా ఏడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత చిత్రాలను నిర్మించడం ఆపేశారు. కలియుగ క్రిష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంటిగారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి సినిమాలను నిర్మించారు. 

కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఉదయం గుండెపోటుతో మరణించడం పట్ల సినీ ప్రముఖులు ద్రిగ్భాంతికి గురవుతున్నారు. ఇండస్ట్రీలోని సినీయర్ నటుల విషాద ఘటనలతో సినీలోకం శోకసంద్రంలో నిలిచిపోయింది. నిన్ననే నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే.
 

click me!