Demon Pavan Love Story: డీమాన్ పవన్ బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన లవ్ స్టోరీని బయటపెట్టాడు. మతిపోయేలా ఆయన ప్రేమ కథ సాగడం విశేషం.
బిగ్ బాస్ తెలుగు 9 షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు డీమాన్ పవన్. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి `అగ్నిపరీక్ష`లో విజయం సాధించి బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చాడు. ఇందులో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచాడు. టాప్ 3లో 20లక్షల సూట్ కేసు తీసుకుని వెళ్లిపోయాడు. అదిరిపోయే జాక్ పాట్ కొట్టాడు. దీంతో డీమాన్ పవన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
24
విమర్శలను తట్టుకొని నిలబడ్డ రీతూ, డీమాన్ పవన్ జంట
డీమాన్ పవన్ బిగ్ బాస్ షోలో రీతూ చౌదరీతో బాండింగ్‌ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ పులిహోర కలుపుకున్నారు. లవర్స్ గా కలర్ ఇచ్చారు. కెమిస్ట్రీ పండించారు. క్రేజీ జోడీగా నిలిచారు. చాలా రోజులు సర్వైవ్ అయ్యారు. నిజంగానే ప్రేమికులుగా వ్యవహరించారు. అదే వీరికి కలిసి వచ్చింది. అయితే వీరి బాండింగ్‌కి సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. ఎవరు ఏమన్నా, తమ రిలేషన్ కొనసాగించారు. షో నుంచి బయటకు వచ్చాక కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మంచి స్నేహితులుగా రాణిస్తున్నారు.
34
డీమాన్ పవన్ లవ్ స్టోరీ
ఈ క్రమంలో డీమాన్ పవన్ తన సొంత లవ్ స్టోరీ చెప్పాడు. బ్రేకప్ స్టోరీని బయటపెట్టి షాకిచ్చాడు. తాజాగా ఆయన బిగ్ టీవీలో జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ లో పాల్గొన్నారు. దీని ప్రోమో విడుదలయ్యింది. ఇందులో లవ్ స్టోరీ గురించి అడగ్గా షాకిచ్చే స్టోరీ చెప్పాడు పవన్. తాను ఒక అమ్మాయిని ప్రేమించాడట. కొన్నాళ్లు బాగానే ప్రేమించిందట. కానీ ఆమె తన ఫ్రెండ్‌కి కనెక్ట్ అయ్యిందట. దీంతో ఆయనతో జంప్ అయ్యిందని చెప్పాడు పవన్. పవన్ చెప్పిన తీరు కామెడీగా ఉంది. కానీ అందులో చాలా పెయిన్ ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఇందులో తన ఫ్యామిలీ స్టోరీని పంచుకున్నాడు పవన్. తన నాన్న పరిస్థితిని వెల్లడించారు. తాను బిగ్ బాస్ షోకి రావడానికి నెల రోజుల ముందే నాన్నకి క్యాన్సర్ అని తేలిందట. నాలుకకి క్యాన్సర్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతుందని చెప్పాడు. తనకు పెద్దగా ఆస్తులు లేవని, చాలా పేదరికం నుంచి వచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు తాను ధరించే డ్రెస్ ధర కూడా తక్కువే అని చెప్పాడు. లోపల ధరించిన టీషర్ట్ ధర రెండు వందల రూపాయలే అని చెప్పి షాకిచ్చాడు. ఒకప్పుడు పంప్లెట్లు పంచేవాడట. పాలు కూడా వేశాడట. చిన్నప్పుడు చాలా చూసి వచ్చానని తెలిపాడు. దేవుడు భరించే వారికే బాధ్యతలు ఇస్తాడు. భరించే శక్తి ఉంది కాబట్టే అన్ని బాధ్యతలు ఇచ్చాడని చెప్పాడు పవన్.