Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని ఇమ్మాన్యుయల్ తన కామెడీతో నడిపించాడు. గేమ్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఆడి, అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ టాప్ 3 కి కూడా వెళ్లకపోవడంపై నటి రోహిణీ స్పందించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్ ఫినాలే తో ముగిసింది. కామనర్ గా అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ ద్వారా సెలక్ట్ అయ్యి హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాలా.. విన్నర్ గా నిలిచాడు. ట్రోఫీ తో పాటు రూ.40 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాడు. అయితే.. ఈ సీజన్ ని ముందు నుంచీ నడిపించింది మాత్రం కమెడియన్ ఇమ్మాన్యుయల్ అని చెప్పొచ్చు. సీజన్ మొత్తం తన కామెడీతో అందరినీ నవ్వించాడు. కేవలం కామెడీ చేయడమే కాదు.. గేమ్స్ వచ్చినప్పుడు తన సత్తా కూడా చాటాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో కమెడియన్స్ విన్నర్ అవ్వలేదు.. కానీ.. ఇమ్మాన్యుయల్ మాత్రం అవుతాడని.. కప్ సాధిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. విన్నర్ కాదు కదా.. కనీసం టాప్ 3 లో కూడా లేడు.
23
ఇమ్మూ ఓడిపోవడంపై రోహిణీ బాధ
5వ స్థానంలో సంజనా ఎలిమినేట్ అవ్వగా, నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ విషయం బయటకు రాగానే... అతని అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఆయన స్నేహితులు రోహిణీ, టేస్టీ తేజ చాలా ఎక్కువగా హర్ట్ అయ్యారు. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత సీజన్ లో టేస్టీ తేజ, రోహిణీ చాలా బాగా ఆడినా కూడా విన్నింగ్ రేసులో కూడా నిలపడలేదు. కనీసం ఇమ్మాన్యుయల్ అయినా విన్నర్ అవుతాడు అనుకుంటే అవ్వలేదని బాధపడ్డారు.
33
బీబీ టీమ్ పై మండిపడ్డ రోహిణీ
ఇమ్మాన్యుయల్ ఇలా నాలుగో స్థానంలో బయటకు రావడం పట్ల తాను చాలా బాధపడ్డానని రోహిణీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇమ్మూ గెలవకపోవడానికి ప్రేక్షకులు ఒక కారణం అయితే.. బీబీ టీమ్ కూడా కారణమే అని ఆమె పేర్కొన్నారు. ఇమ్మూని గెలిపించలేకపోవడంలో.. అందరూ ఫెయిల్ అయ్యారు అని రోహిణీ అభిప్రాయపడ్డారు. టైటిల్ రాయకపోయినా.. ఈ సీజన్ నిజమైన విన్నర్ ఇమ్మూ అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోహిణీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. టేస్టీ తేజ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ లో ఉన్నంత వరకూ కళ్యాణ్, తనూజ అంటూ పోటీ జరిగింది. కానీ, ఎవరూ ఇమ్మూని గుర్తించలేదు. అందుకే.. నాలుగో స్థానానికి పడిపోయాడు. సీజన్ మొదట్లో ఇమ్మూ విన్నర్ అవుతాడనే అనుకున్నారు. నాలుగో స్థానంలో వస్తానని ఇమ్మూ కూడా ఊహించలేదు. ఎలిమినేట్ అవ్వగానే ఇమ్మాన్యుయల్, అతని తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.