బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పైనల్స్ లో చాలా తెలివిగా ఆలోచి.. టాప్ 3 స్థానంతో పాటు, 15 లక్షల ప్రైజ్ మనీ కూడా సాధించుకుని బయటకు వచ్చాడు డీమాన్ పవన్. వచ్చీ రావడంతోనే.. పవన్ ను వరుస అవకాశాలు వెల్లువెతుతున్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి.. అనుకోకుండా.. అనూహ్యంగా టాప్ 3 లోకి వచ్చాడు డీమాన్ పవన్. ఇంకా రీతూ చౌదరి వల్ల కాస్త వెనకపడ్డాడు కానీ.. లేకుంటే ఫైనల్స్ లోకి వెళ్లేవాడు అని చాలామంది అభిప్రాయాయం. రీతు హడావిడిలో పడి తన గేమ్ నే మర్చిపోయాడు. రీతూ చుట్టు తిరుగుతూ.. కావల్సినంత స్టఫ్ మాత్రం ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో పవన్ ఆటతీరు కూడా అందరి దృష్టిని ఆకర్శించింది. ఒక్కోసారి తన ఆట, తన మాట తీరుతో అందరి అభిప్రాయాలను పూర్తిగా మార్చేశారు. కండబలంతో పాటు బుద్ధిబలం ఉపయోగించి ఆడుతూ, తాను సాధారణ కంటెస్టెంట్ కాదని నిరూపించారు. వరుసగా రెండుసార్లు కెప్టెన్‌గా నిలిచాడు. రీతూతో ఉన్న లవ్ ట్రాక్ కారణంగా పవన్‌పై చాలా నెగెటివిటీ వచ్చింది.
24
బిగ్ బాస్ తరువాత కూడా రీతూతో పవన్ జర్నీ.. ?
బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయిన తరువాత డిమాన్ పవన్ లో అసలు ఆటగాడు బయటు వచ్చాడు. ఫైనల్ వీక్ లో తన సత్తా ఏంటో చూపించాడు పవన్ ఆట తీరుతో మెస్మరైజ్ చేశాడు. టాప్ 5 లోకి అవలీలగా వచ్చిన డీమాన్.. టాప్ 3గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా డీమాన్ తో రీతూ జర్నీ కంటీన్యూ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు జంటగా ఓ షోలో సందడి చేయబోతున్నారట. ఈసారి వీరిద్దరి మధ్యఆన్ స్క్రీన్ రొమాన్స్ ఘాటుగా ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
34
బీబీ జోడీ 2 లో రీతూ, పవన్
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే డిమోన్ పవన్‌కు ఆఫర్లు కుప్పులుగా వచ్చిపడుతున్నాయట. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్.. ఇలా కొత్త కుర్రాడికోసం చాలామంది ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లో టాప్ లో నిలిచినవారితో మా సంస్థ కొన్ని ఆఫర్స్ ఇస్తుంది. అందులో భాగంగా.. బిగ్ బాస్ లో మంచి రోమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న డీమాన్ పవన్, రీతూతో మా సంస్థ కాంట్రాక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. డ్యాన్స్‌లో మంచి ప్రతిభ ఉన్న డిమోన్ పవన్, ఈ శనివారం నుంచి ప్రారంభమయ్యే ‘బీబీ జోడి 2’లో రీతూ చౌదరితో కలిసి వైల్డ్ కార్డు ఎంట్రీగా పాల్గొనే అవకాశముందని సమాచారం. ఈ కాంట్రాక్ట్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
బీబీ జోడీ 2 లో రీతూ, పవన్ కనిపిస్తే.. అభిమానులకు పండగే.. ఈ ప్రోగ్రామ్ టీఆర్పీలు కూడా పెరుగుతాయి అంటున్నారు. అంతే కాదు డీమాన్ పవన్ ఒక వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఈవెంట్లు, రియాలిటీ షోలతో రాబోయే రోజుల్లో డిమోన్ పవన్ పూర్తిగా బిజీ అవుతాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బిగ్ బాస్ తర్వాత ఆయన కెరీర్ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. బిగ్ బాస్ వల్ల అందులో పాల్గొన్న ఆర్టిస్టుల్లో ఎవరికి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. శివాజీ, రాహుల్ సిప్లిగంజ్, మానస్ లాంటి వారు కాస్త బిజీ అయ్యారు అంతే. మిగిలిన వారికి పెద్దగా పాపులారిటీ రాలేదు.