పింక్‌ డ్రెస్‌లో క్యూట్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా.. షణ్ముఖ్‌ అన్‌ లక్కీ ఫెలో అంటూ కామెంట్లు

Published : Jun 02, 2022, 08:35 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా యూట్యూబ్‌లో,సోషల్‌ మీడియాలో చేసే సందడి మామూలు కాదు. అందుకే చిన్న ఏజ్‌లోనే విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. మరోవైపు గ్లామర్‌ ఫోటోషూట్లతో మరింతగా కట్టిపడేస్తుంది దీప్తి. 

PREV
112
పింక్‌ డ్రెస్‌లో క్యూట్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా.. షణ్ముఖ్‌ అన్‌ లక్కీ ఫెలో అంటూ కామెంట్లు

దీప్తి సునైనా(Deepthi Sunaina) హాట్‌ ఫోటోషూట్లతో కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. తాజాగా ఆమె పింక్‌ డ్రెస్‌లో హోయలు పోతూ ఇచ్చిన ఫోటో షూట్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆమె ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అయినట్టుగా ఉన్న దీప్తి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

212

ఇందులో చిన్న మట్టికుండ పట్టుకుని పల్లెటూరి పడుచు పిల్ల మాదిరిగా ఈ అమ్మడు ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. క్యూట్‌ అందాలతో రెచ్చగొడుతుంది. గిలిగింతలు పెడుతుంది. నెమ్మదిగా హంట్‌ చేస్తుంది. తన మాయలో పడేసుకుంటుంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది దీప్తి సునైనా. ముఖ్యంగా ఆమె వయ్యారాలు ఒలకబోస్తూ ఇచ్చిన పోజులే చూపు తిప్పుకోనివ్వడం లేదు.

312

లేటెస్ట్ దీప్తి సునైనా ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లని, ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వాటిని ఫ్యాన్స్ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. క్యూట్‌, హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అని, అందానికే అసూయ పుట్టించే అందం నీది అని, అందాన్ని మించిన అందం నీ సొంతమని కామెంట్లు పెడుతున్నారు. దీప్తిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

412

మరికొందరు కొంటే నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇలా దీప్తిని చూస్తే షణ్ముఖ్‌ ఏమైపోతాడంటూ కామెంట్లు పెడుతున్నారు. షణ్ముఖ్‌ ఇంతటి అందాన్ని ఎలా మిస్‌ చేసుకున్నావ్‌ అంటున్నారు. షణ్ముఖ్‌ అన్‌ లక్కీ ఫెలో అంటూ కామెంట్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 
 

512

దీప్తికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. చిన్న ఏజ్‌లోనే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్‌ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. తన టాలెంట్‌తో ఈస్థాయికి చేరుకుని దూసుకుపోతుందీ బిగ్‌ బాస్‌ పిల్ల.

612

బిగ్‌ బాస్‌ 2 సీజన్‌లో పాల్గొంది దీప్తి సునైనా. నాని హోస్ట్ గా ఉన్నారు. ఇందులో చలాకీతనంతో ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌ వీడియోలు,షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, వెబ్‌ సిరీస్‌లు ఆమెకి విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. రెండో సీజన్‌లో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసింది. తనకంటూ ఓసెపరేట్‌ ఐడెంటిటీని సొంతం చేసుకుంది. 

712

ఆ తర్వాత అడపాదడపా స్టార్‌ మాలోని పలు షోస్‌లో మెరిసింది దీప్తి సునైనా. అయితే ఆమెకి సినిమా ఆఫర్లు మాత్రం తేలేకపోయింది. దీంతో తనని నిలబెట్టిన, తనకు లైఫ్‌ ఇచ్చిన యూట్యూబ్‌నే మళ్లీ నమ్ముకుంది. వరుసగా వీడియో సాంగ్‌లో చేస్తూ ఆకట్టుకుంది. అద్భుతమైన ఎమోషన్స్ ని పలికిస్తూ కట్టిపడేస్తుంది.

812

యూట్యూబ్‌ వీడియోల ద్వారా ఇప్పటికీ అలరిస్తుంది దీప్తి సునైనా. తనకు లైఫ్‌ ఇచ్చిన దాన్ని వదలకుండా, ఇతర ప్రయత్నాలు చేస్తుంది. టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది దీప్తి. 

912

ఇదిలా ఉంటే తన ప్రియుడు షణ్ముఖ్‌కి బ్రేకప్‌ చెప్పిన విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ 5 లో పాల్గొన్నారు. ఆ షోలో ఆయన రన్నరప్‌గా తిరిగి వచ్చారు. కానీ ఆ హౌజ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు దీప్తిపై ప్రభావం చూపాయి. దీంతో షో పూర్తి కాగానే ఆయనకు బ్రేకప్‌ ప్రకటించి షాకిచ్చింది. 

1012

దీనిపై షణ్ముఖ్‌ చాలా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. దీప్తి మనసు విరిగిపోయింది. ఆమె ఆయనతో రిలేషన్‌కి గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న దీప్తి తన కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. జీవితంలో కసిగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ప్రేమ కంటే లైఫ్‌ ముఖ్యమనే కోణంలో ముందుకు సాగుతుంది. 

1112

మరోవైపు నిత్యం ఇలా హాట్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇప్పటికే ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్‌ ఫాలోయింగ్‌ ఉంది. దాన్ని రెట్టింపు చేస్తుంది. తన ఫాలోవర్స్ ని కనువిందు చేసేందుకు హాట్‌ ఫోటోలను పంచుకుంటుంది. 

1212

తాజాగా పింక్‌ డ్రెస్‌లో దీప్తి దిగిన ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో దీప్తి ఇచ్చిన క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ చూపుతిప్పుకోనివ్వడం లేదంటున్నారు ఇంటర్నెట్‌ ఫ్యాన్స్. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories