బికినీ ఫొటో షేర్ చేసిన దీపికా పదుకొణె.. ‘వార్నింగ్’ అంటూ భర్త రన్వీర్ సింగ్ కామెంట్!

First Published | Jul 31, 2023, 6:53 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)  తాజాగా పంచుకున్న ఫొటోకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ఏకంగా బికినీ పిక్ ను షేర్ చేసింది. దీనిపై భర్త రన్బీర్ సింగ్ కూడా స్పందించడం విశేషం. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె చివరిగా ‘పఠాన్’తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. షారుఖ్ ఖాన్ సరసన నటించిన ఈ పొడుగుకాళ్ల సుందరి యాక్షన్ తో దుమ్ములేపింది. మరోవైపు ఓ సాంగ్ లో బికినీలో డాన్స్ వేసి మతులు పోగొట్టింది. 
 

‘బే షరమ్ రంగ్’ సాంగ్ లో కాషాయ దుస్తుల్లో దీపికా పదుకొణె స్పెషల్ సాంగ్ గా నటించిన విషయం తెలిసిందే. స్కీన్ షోతో ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చకు థియేటర్లు దద్దరిల్లాయి. సోషల్ మీడియా కూడా షేక్ అయ్యింది. ఇక తాజాగా అదే తరహాలో ఓ ఫొటోను షేర్ చేసింది. 
 


బ్లాక్ టినీ బికినీలో దీపికా పదుకొణె బోల్డ్ లుక్ కు సంబంధించిన  పిక్స్ ను ఇన్ స్టా వేదికన షేర్ చేసింది. ఇటీవల చాలా స్టైలిష్ గా, శారీలో రాయల్ లుక్ లో దర్శనమిస్తూ వస్తున్న దీపికా ఒక్కసారిగా ఇలాంటి ఫొటోలను పంచుకోవడంతో ఇంటర్నెట్ షేక్ వస్తోంది. 
 

స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ బాలీవుడ్ భామ హీట్ పెంచేసింది. అయితే ఈ పిక్ ఇప్పటిది కాదని, అలాగని చాలా రోజుల కిందిదీ కాదని తెలిపింది. దీంతో ‘పఠాన్’ షూటింగ్ సమయంలోనే అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఇప్పుడిలాంటి పిక్ ను ఎందుకు షేర్ చేసిందనేది క్లారిటీ లేదు. 
 

ఇదిలా ఉంటే.. దీపికా పదుకొణె బికినీ లుక్ పై భర్త రన్బీర్ ఫస్ట్  కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘ఒక హెచ్చరిక బాగుంటుంది’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఫొటోలను మరింతగా వైరల్ చేస్తున్నారు. 
 

ఇక దీపికా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ సినిమా ‘కల్కి : 2898 ఏడీ’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంటోంది. అలాగే హిందీలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ సరసన ‘ఫైటర్’లోనూ నటిస్తోంది. 
 

Latest Videos

click me!