ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను.. దీపికా పదుకొనే సంచలన వ్యాఖ్యలు

Published : Aug 07, 2022, 10:54 AM IST

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనే  సంచలన వ్యాఖ్యలు చేసింది.  తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒకప్పుడు ఏర్పడిందని.. కాని తాను నిలబడి పోరాడానని... పిరికితనంతో జీవితాన్నా నాశనం చేసుకోవద్దంది. ఇంతకీ దీపికా ఈ మాటలు ఎందుకు చెప్పింది..? ఎక్కడ చెప్పింది...?

PREV
17
ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను.. దీపికా పదుకొనే సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనే  సంచలన వ్యాఖ్యలు చేసింది.  తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒకప్పుడు ఏర్పడిందని.. కాని తాను నిలబడి పోరాడానని... పిరికితనంతో జీవితాన్నా నాశనం చేసుకోవద్దంది. ఇంతకీ దీపికా ఈ మాటలు ఎందుకు చెప్పింది..? ఎక్కడ చెప్పింది...?

27

ఈ ఈవెంట్ లో  దీపికా పదుకొనే మానసికంగా ఇబ్బందిపడుతున్న వారిలో ధైర్య నింపే ప్రయత్నం చేసింది. అంతే కాదు తన జీవితాన్ని ఉదాహరణగా మార్చింది. దీపికా మాట్లాడుతూ.. నటిగా నా కెరీర్‌ చాలా బాగున్నప్పుడే నాకు ఎందుకో బాధగా ఉండేది. ఆ బాధకు కారణం తెలీదు. ఏడుపొచ్చేది. అలాంటి టైంలో బాధని మర్చిపోవాలంటే నిద్ర ఒక్కటే మార్గం అనుకోని ఎక్కువగా నిద్రపోయేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు కూడా వచ్చాయి. అన్నారు దీపికా. 

37
Deepika Padukone

అయితే గతంలో దీపికా డిప్రెషన్ లోకి వెళ్లింది లవ్ ఫెల్యూర్ వల్లనే అనే ప్రచారం జరిగింది.  ఆమె కూడా కొన్ని ఇంటర్వ్యూలలో తన మనసు ముక్కలు చేశారంటూ బాధపడింది. అయితే ఇంతకు ముందు రణ్ బీర్ కపూర్ తో ప్రేమయాణం నడిపించింది బ్యూటీ.. కాని అది పెళ్ళి వరకూ వెళ్లలేదు. అయితే ఈ బ్రేకప్ తో దీపికా బాగా డిస్ట్రబ్ అయ్యింది. 
 

47

ఆత్మహత్య ఆలోచనలు రావడమే కాదు..  చేసుకోవాలి అనుకున్నాను కూడా. ఆ సమయంలో నేను ముంబైలో, మా అమ్మ, నాన్న బెంగుళూరులో ఉండేవారు. మా అమ్మ, నాన్న వచ్చినప్పుడు వాళ్ళ ముందు మాత్రం చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. కానీ ఒకసారి మా అమ్మ దగ్గర ఏడ్చేశాను అంటూ.. తనలోని బాధను చెప్పుకొచ్చింది దీపికా. 
 

57

తాను ఆ ప్రమాధం నుంచి బయట పడటానికి అమ్మే కారణమంటోంది దీపికా.. ఇంకా ఏమన్నదంటే..? మా అమ్మ నా పరిస్థితి చూసి ముందుగా  ఆందోళన చెందింది. ఆతరువాత నా బాధకి కారణం ఏంటి అని అడిగింది. నేనేమి చెప్పలేకపోయాను. ఆ టైమ్ లో  మా అమ్మ నా దగ్గరే ఉంది, నన్ను అర్ధం చేసుకొని చూసుకుంది. అమ్మ చూసుకోబట్టి ఈ రోజు ఇలా బ్రతికి ఉన్నానంటోంది దీపికా.

67
Cannes 2022 - Deepika Padukone shone in white saree on the last day

అంతే కాదు ఆ సమయంలో  అమ్మ ఉండటం వల్లే తాను ఇవాళ ఇలా స్టార్ హీరోయిన్ గా మీ ముందు ఉన్నానంటోంది. తాను జీవితంలో సధించినవన్నింటోలో తన తల్లి ఇచ్చి ధైర్యంతోనే సాధించినవే అంటోంది దీపికా.

77

ఇక ఈ కార్యక్రమంలో దీపికా మాట్లాడుతూ... డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరితో అయినా ఉండండి. ఆ సమయంలో మీ బాధని పంచుకోండి అంటూ సలహా ఇచ్చింది దీపికా. ఇప్పుడు రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకొని, వరుస సినిమాలతో బిజీగా ఉంటూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది దీపికా పదుకొనే.

Read more Photos on
click me!

Recommended Stories