ఆఫ్ స్క్రీన్ లో కూడా తగ్గని కెమిస్ట్రీ.. జవాన్ సక్సెస్ పార్టీలో షారుఖ్ కి దీపికా కిస్సులు, రణ్వీర్ కామెంట్

Sreeharsha Gopagani | Published : Sep 16, 2023 6:50 AM
Google News Follow Us

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఈ చిత్రం బిగ్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ శుక్రవారం రోజు సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. 

19
ఆఫ్ స్క్రీన్ లో కూడా తగ్గని కెమిస్ట్రీ.. జవాన్ సక్సెస్ పార్టీలో షారుఖ్ కి దీపికా కిస్సులు, రణ్వీర్ కామెంట్

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 

 

29

తొలి షో నుంచే అట్లీ, షారుఖ్, నయనతార చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో జవాన్ చిత్రం అనేక రికార్డులు తిరగరాస్తోంది. 

39

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. నయనతార హీరోయిన్ గా నటించగా.. షారుఖ్ లక్కీ లేడీ దీపికా కీలక పాత్రలో నటించింది. 

Related Articles

49

ఈ చిత్రం బిగ్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ శుక్రవారం రోజు సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షారుఖ్, అట్లీ, విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతితో పాటు దీపికా కూడా హాజరైంది. 

59

వైట్ శారీలో తెల్ల పావురంలా మెరిసిపోతూ వేదికపై బ్లాస్టింగ్ ఫోజులు ఇచ్చింది దీపికా. ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా షారుఖ్ తో కెమిస్ట్రీలో ఏమాత్రం తగ్గను అనే విధంగా దీపికా రెచ్చిపోయింది. దీపికా, షారుఖ్ ముద్దు ఫోటోలపై రణ్వీర్ సింగ్ స్పందించాడు. నా హృదయం ప్రేమతో నిండిపోయింది అంటూ కామెంట్ పెట్టాడు. 

69

షారుఖ్ ని ముద్దుల్లో ముంచెత్తుతూ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. దీపికా డెడ్లీ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాను ఎంత సొగసైన అందగత్తెనో చెప్పే విధంగా దీపికా చీరలో మెరిసింది. 

79

  దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

89

వివాహం తర్వాత కూడా దీపికా క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.    దీపికా పదుకొనె తరచుగా హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో విన్ డీజిల్ తో దీపికా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది.

99

 వివాహం తర్వాత కూడానా దీపికా గ్లామర్, రొమాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్యన దీపికా నటించిన గెహైర్యాన్ చిత్రంలో దీపికా రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది.   

 

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos