Adah Sharma : ‘నా రక్తం తాగేస్తున్నాయి’.. టాప్ పైకి జరిపి మరీ ఫ్రూప్ చూపిస్తూ అదా శర్మ రచ్చ.!

First Published | Feb 10, 2024, 5:12 PM IST

యంగ్ హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) పంచుకున్న సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమెకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోవడం ఇంట్రెస్టింగ్ గా న్యూస్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. 
 

బాలీవుడ్ కుర్ర హీరోయిన్  అదా శర్మ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో ఆయా చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లోనూ పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అదా శర్మ చాలానే యాక్టివ్ గా ఉంటుంది. ఫన్నీ వీడియోలను, ఫొటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. 


ఆ వీడియోలో అదా శర్మ ఓ సెట్ లో తనను దోమలు కుట్టి రక్తం మొత్తం తాగేస్తున్నాయని చెప్పుకుంది. టాప్ పైకి లేపి మరీ దద్దులను కెమెరాకు చూపించింది. అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం ఇంత దానికే అంత చేయాలా అంటున్నారు.. మరికొందరు మాత్రం అయ్యో ఎంత కష్టమొచ్చిందంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

ఇక ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ కు మాత్రం అదా శర్మను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిచయం చేశారు. నితిన్ - పూరీ కాంబోలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంలో హీరోయిన్ గా అదా శర్మ అలరించింది. తన పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. తెలుగులో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’, ‘కల్కి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 
 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. హిందీలోనే నటిస్తోంది. చివరిగా ‘ది కేరళ స్టోరీ’ The Kerala Storyతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈనెల 16నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
 

Latest Videos

click me!