గుచ్చె గులాబి బాలా అని ఓ కవి ఏమంటా అన్నాడో కాని. గులాబీ సోయగాలతో సందడి చేస్తోంది యాంకర్ వర్షిణి. వైట్ డ్రెస్ లో ఏంజల్ లా మెరిసిపోతున్న అమ్మడి అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రతీ వారం వర్షిణి సోయగాల విందు కోసం ఎదురు చూస్తుంటారు.
28
రీసెంట్ గా వర్షిణి ఫోటో షూట్ కు మెస్మరైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. తెల్లగౌను వేసుకున్న పాపా అంటూ.. పాడుకుని మురిసిపోతున్నారు. ఎర్ర గులాబీల తో బుగ్గలను ఎరుపెక్కిస్తూ..మత్తు కళ్ళతో వర్షిణి ఇచ్చిన ట్రీట్ కు కుర్రాళ్ల మతి పోయేలా ఉంది.
38
బుల్లితెరపై యాంకర్ గామెరుపులు మెరిపిస్తున్న వర్షిణీ సౌందరాజన్.. బుల్లి తెరపై స్టార్ డమ్ మాత్రం సాధించలేకపోయింది. అనసూయ,రష్మి, శ్రీముఖి లాంటి యాంకర్ల తరువాతి స్థానంతో మాత్రమే సర్ధుకోవల్సి వచ్చింది.
48
సోషల్ మీడియాలో మాత్రం వర్షిణి హాట్ షోకు పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ ఉంది. బుల్లి తెరపై వెనకబడి ఉన్నా..ఇన్ స్టా ఫాలోవర్స్ లో మాత్రం దూసుకుపోతోంది వర్షిణి. ఇన్ స్టాలో దాదాపు 18 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఎప్పటికప్పుడు అవకాశాల కోసం హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాను నింపేస్తుంది బ్యూటీ.
58
ఢీ డాన్స్ షో సీజన్ 12 తో బాగా పాపులర్ అయ్యింది వర్షిణి. సుధీర్- రష్మీ జోడీతో పాటు హైపర్ ఆది- వర్షిణి జోడీగి కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆతరువాతి నుంచి మాత్రం ఢీలో కనిపించలేదు వర్షిణి. యాంకర్ గా కూడా సోలో అవకాశాలు చాలా తక్కువయ్యాయి బ్యూటీకి.
68
హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. సాధ్యం కాక.. బుల్లి తెరపై సెటిల్ అయింది వర్షిణి. ఇక్కడ తన వంతు ప్రయత్నం చేస్తుంది. పాపులారిటీ వచ్చినా.. స్టార్ డమ్ రాకపోవడంతో.. గట్టిగానే ప్రయత్నిస్తోంది. మంచి టైమ్ కోసం చూస్తున్న వర్షిణి.. సోషల్ మీడియాలో తన వంతు ప్రయత్నం చేస్తోంది.
78
స్టార్ మా లో కామెడీ స్టార్స్ షోకి సోలో గా యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు వర్షిణి. ఆ షో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో వర్షిణి పాల్గొంటున్నారని అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే వర్షిణి ఎంట్రీ ఇవ్వలేదు. కనీసం ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.
88
స్మాల్ స్క్రీన్ పై ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇన్ స్టాలో ఆమె అభిమానుల లిస్ట్ అంతకంతకూ పెరుగుతుంది. మరి ఈ ఇమేజ్ తో అయినా.. వర్షిణికి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.