కాన్ ఫెస్టివల్ డిన్నర్ పార్టీలో దీపిక, మినీ జాకెట్ లో మతిపొగొడుతున్న బాలీవుడ్ బ్యూటి

Published : May 21, 2022, 11:03 AM IST

కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో మెరుపులు మెరిపించింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. ఇక నిన్న జరిగిన అధికారిక డిన్నర్ పార్టీలో దీపికా పదుకొణె మరోసారి తన ఫ్యాషన్ ఔటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.  లెదర్ షూ తో పాటు  పాటు మినీ జాకెట్ లో కనువిందు చేసింది సుందరి. 

PREV
17
కాన్ ఫెస్టివల్  డిన్నర్ పార్టీలో దీపిక, మినీ జాకెట్ లో మతిపొగొడుతున్న బాలీవుడ్ బ్యూటి

కేన్స్ 2022లోని ఎనిమిది మంది జ్యూరీ సభ్యులలో దీపికా పదుకొణె ఒకరు.  కాన్ ఫెస్ట్ లో రకరకాలు లుక్స్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై తన అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకుంది దీపిక. అందాల అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. 

27

ఇక దీపిక గత రాత్రి డిన్నర్ పార్టీలో తన ఎడ్జీ లుక్ తో మరోసారి ఆకట్టుకుంది.  ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో వానిటీ ఫెయిర్ మరియు లూయిస్ విట్టన్ నిర్వహించిన అధికారిక డిన్నర్ పార్టీకి దీపికా పదుకొనే  హాజరయ్యారు. ఈ పార్టీలో దీపికను చూసిన వారు హౌరా అనకుండా మానరు. 

37

లూయిస్ విట్టన్ హౌస్ అంబాసిడర్ గా ఉన్న  బాలీవుడ్ సూపర్ స్టార్ దీపిక, గత రాత్రి బ్రాండ్ యొక్క అధికారిక డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. ఫ్యాషన్ హౌస్  అల్మారాల్లో నుండి ఫ్యాషన్ వేర్ ను వేసుకున్న దీపికా అందరి చూపులు తన వైపు తిప్పుకుంది. 

47

ఆమె లేత గోధుమరంగు మినీ జాకెట్ లో అద్భతంలా కనిపించింది దీపికా. దానిని ఆమె లెదర్ షూను కూడా జత చేసింది. మల్టీ కలర్ ప్లవర్ తో డిజైన్ చేయబడిన  ప్రింటెడ్ వైట్ షర్ట్ పైన దీపిక జాకెట్ డ్రెస్ వేసుకుంది.  మేకప్ పెద్దగా లేకున్నా.. దీపిక లుక్ మెస్మరైజ్ చేస్తోంది. 

57

డిన్నర్ పార్టీ నుండి గెహ్రైయన్ నటి ఫోటోలు వీడియోలు, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంతైనా దీపిక.. దీపికానే అంటున్నారు. కాన్ లో మెరిసిన ఇండింయన్ డైమంట్ అంటూ పొగిడేస్తున్నారు. 
 

67

కరోనావైరస్ కారణంగా కాన్స్ రెండేళ్ల జరగేలేదు. లాంగ్ గ్యాప్ తరువాత  75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 17న ప్రారంభమైంది. ఓపెనింగ్ వేడుకలో దీపికా పదుకొణె  గోల్డ్  అండ్ బ్లాక్ చీరలో  రెడ్ కార్పెట్ మీద నడిచింది. ఆమె ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌ జ్యూరీలో సభ్యురాలిగా ఉన్నారు. 

77

ఈసారి కాన్స్ లో  ఇండియన్ సినిమాకి ఎక్కువ గౌరవం లభించింది. కాన్స్ స్టార్ట్ అయిన రోజే.. మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు ఇండియన్ స్టార్స్ రెడ్ కార్పెట్ పై నడిచారు. ఈ టీమ్ లో ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే, శేఖర్ కపూర్ లాంటి స్టార్స్ ఉన్నారు. 

click me!

Recommended Stories