గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్స్ మిక్స్ తో షో సిద్ధం చేశారు. పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ ని చాలెంజర్స్ గా విభజించారు. ఈ షోకి మిక్స్డ్ స్పందన దక్కింది. మొత్తంగా అంతిమ దశకు చేరుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్, యాంకర్ శివ, మిత్ర, అనిల్ రాథోడ్, అఖిల్ సార్థక్ (Akhil Sarthak), బిందు మాధవి, అరియనా ఫైనల్ కి చేరారు. వీరి నుండి ఒకరు టైటిల్ చేజిక్కించుకున్నారు.