నన్ను తొక్కేస్తారేమో అని భయపడ్డాను, కరోనా ఆ మూడు విలువలు నేర్పింది: దీపికా పదుకొనే

Published : May 29, 2022, 02:19 PM IST

తన నటజీవితంలో  ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేశానంటోంది దీపికా పడుకునే. ప్రపంచ శక్తిమంతుల జబితాలో చేరిన దీపిక.. ఎంతో ఆనందంగా ఉంది అంటోంది. తన సినీ ప్రయాణం గురించి వివరించింది. 

PREV
18
నన్ను తొక్కేస్తారేమో అని భయపడ్డాను, కరోనా ఆ మూడు విలువలు నేర్పింది: దీపికా పదుకొనే

ఈ సంవత్సరం కూడా టైమ్స్‌-100 జాబితాలో చోటు దక్కడం ఆనందంగా ఉంది అంటోంది దీపికా పదుకొనే. అయితే ఈసారి నాలోని నటికి కాకుండా.. నాలోని శక్తిమంతురాలైన స్త్రీకి ఈ గుర్తింపు లభించింది. మానసిక సమస్యను నేను అధిగమించిన తీరు టైమ్స్‌ ను ఆకట్టుకుంది అంటోంది. 
 

28

ఆడ, మగ మధ్య ఉన్న చిన్నపాటి విభజన రేఖపట్ల నాకు స్పష్టత ఉంది. నేను, నా చెల్లి వాటికి అతీతంగా పెరిగినా.. పరిస్థితులు, పరిసరాలు కొత్త పాఠాలు నేర్పుతూనే ఉన్నాయి. నేను మాత్రం.. ఇప్పటివరకు మనుషులను వేరుచేసి చూడలేదు అంటోంది దీపికా. 
 

38

పద్దెనిమిదేండ్లకే మోడల్‌గా నా ప్రయాణం ప్రారంభించిన దీపికా.. . నిజానికి ఆమెఒకఅథ్లెట్‌. దీపిక తండ్రి ప్రకాశ్‌ పదుకొనె నుంచి ఆట వారసత్వంగా వచ్చింది. అందువల్లే శరీరాన్ని, మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు అంటోంది. 
 

48
Image: Getty Images

లాక్‌డౌన్‌ నాకు చాలా నేర్పింది. ఎప్పుడూ షూటింగ్‌లు, పని, జర్నీలు  అంటూ బిజీబిజీగా తిరిగేదాన్ని. కరోనా సీజన్‌లో కుటుంబంతో గడిపేందుకు తీరిక దొరికింది. మనసును నియంత్రించడం అనేది నాకు ముందునుంచే అలవాటు కాబట్టి, ఏమంత ఇబ్బందిగా అనిపించలేదు. సమయం విలువేమిటో, డబ్బు విలువేమిటో, బంధువుల విలువేమిటో, ఆఖరికి మనం పీల్చే గాలి విలువేమిటో కూడా నేర్పింది అని అంటోంది దీపికా పదుకొనే. 

58

కొవిడ్‌ వల్ల ఆత్మీయులను కోల్పోయి కొందరు, జాబ్స్ పోగొట్టుకొని కొందరు చాలా ఇబ్బందిపడ్డారు. కాని నేను లాక్‌డౌన్‌లో రణ్‌వీర్‌తో గడపడానికి మంచి టైమ్ దొరికింది....పెళ్లి తర్వాత మేమిద్దరం మరింత దగ్గరయ్యాం. మా ఇద్దరి కుటుంబాలు ఇంకా దగ్గరయ్యాయి అని అంటోంది దీపికా. 

68
Deepika Padukone Cannes redcarpet Photos

నిజానికి పరిశ్రమకు రావడానికి ముందే నన్ను నేను చాలా ప్రశ్నలు వేసుకున్నా. ఎందుకంటే నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. పైగా నా భాషలో దక్షిణాది యాస కొట్టొచ్చినట్టు కనిపించేది. నిజంగా నేను పరిశ్రమలో నిలదొక్కుకోగలనా? నా భాషవన్న నన్ను నిలబడనిస్తారా...? తోక్కేయాలని చూసేవారి పరిస్థితి ఏంటీ.. అంటూ భయపడిందట దీపికా. 

78

ఇక నా ప్రయాణం ఎలా ఉండబోతుందో? అని భయపడ్డాను. వాటన్నిటికి సమాధానమే ఈ రోజు నాకు దక్కిన గుర్తింపు అంటూ తెగ సంబరపడిపోతోంది దీపికా పదుకొనే.

88

ఇక దీపికాకు చీరలు, చుడీదార్లు ఇష్టం. ఇంట్లో క్యాజువల్స్‌కే ప్రాధాన్యం ఇస్తుందట. గ్రీన్‌, పింక్‌ అంటే తనకు ఎంతో ఇష్టం అంటోంది. మితంగా తింటాను... తగినంత వ్యాయామం చేస్తాను అంటోంది దీపికా. రణ్ వీర్ తో వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నా అన్నారు దీపికా. 

click me!

Recommended Stories