Renu Desai: రేణూ దేశాయ్ రెండో భర్త ఎవరు?  ఇప్పుడు ఎక్కడనున్నారు?...  తెరపైకి కొత్త చర్చ!

First Published | May 29, 2022, 1:45 PM IST

రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి ఫోటో దిగడం కొత్త చర్చకు దారి తీసింది. విడాకులు తీసుకున్న ఈ జంట మరలా కలిసిపోయారా? అనే సందేహం మొదలైంది.
 

Pawan Kalyan-Renu Desai


ప్రేమ వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ 2016లో విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య అమ్మ రేణూ దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. విడాకుల అనంతరం రేణూ పూణే వెళ్లిపోయారు. అక్కడే ఆమె కెరీర్ స్టార్ట్ చేశారు. మరోవైపు పవన్ (Pawan Kalyan) అన్నా లేజినోవాను వివాహం చేసుకున్నారు. 

Pawan Kalyan-Renu Desai

ఈ క్రమంలో రేణూ దేశాయ్ (Renu Desai) కూడా రెండో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పూణేకి చెందిన ఓ వ్యక్తితో రేణూ దేశాయ్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. రేణూ రెండో వివాహాన్ని పవన్ అభిమానులు అంగీకరించలేదు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ బెదిరింపులకు దిగారు. సోషల్ మీడియా వేదికగా వేధించారు. 
 


Pawan Kalyan-Renu Desai

అయితే రేణూ దేశాయ్ ప్రతిఘటించడం జరిగింది. నా వ్యక్తిగత జీవితంపై మీ అజమాయిషీ ఏంటంటూ ఆమె ప్రశ్నించారు. రేణూ దేశాయ్ కి చాలా మంది మద్దతుగా నిలిచారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. పవన్ ఫ్యాన్స్ మాత్రం రచ్చ ఆపలేదు. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత రేణూ దేశాయ్ ఆలీతో సరదాగా షోకి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ టాక్ షోలో రేణూ దేశాయ్ రెండో వివాహం చర్చకు వచ్చింది. 
 

Pawan Kalyan-Renu Desai

అలీ ప్రశ్నకు సమాధానంగా రేణూ వివరాలు వెల్లడించారు. పూణేకు చెందిన ఓ వ్యక్తితో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అతడు అమెరికాలో ఐటీ ఉద్యోగి. వాళ్ళ నాన్న ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇండియా వచ్చేశారు. పుణేలో ఓ ఐటీ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పేరు మాత్రం చెప్పను అన్నారు. 
 

Pawan Kalyan-Renu Desai

అలాగే ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి ఎప్పుడని అందరూ అడుగుతున్నారు. పెళ్లి అనేది చిన్న విషయం కాదు. దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది. మా కంటే కూడా సంబంధం లేని బయటి వాళ్ళు హడావిడి చేస్తున్నారు. మేము చిన్న పిల్లలం కాదు కదా.. అన్ని విధాలుగా ఆలోచించి, పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తాం అన్నారు. 
 

Pawan Kalyan-Renu Desai

ఈ ఇంటర్వ్యూ 2019లో జరగ్గా... మరి రేణూ దేశాయ్ ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు ఆమె ఏడాది క్రితం నివాసం పూణే నుండి హైదరాబాద్ కి మార్చారు. ఒకవేళ వివాహం చేసుకోకున్నా ఆ వ్యక్తితో రేణూ దేశాయ్ బంధం కొనసాగిస్తున్నారా? లేక పవన్ కళ్యాణ్ కోసం దూరం పెట్టారా? అనే సందేహాలు మొదలయ్యాయి.

Pawan Kalyan - Renu desai


ఒకప్పుడు పవన్ పై విమర్శలు చేసిన రేణూ దేశాయ్ ఆయనతో కలిసి ఫోటోలు దిగడం, హైదరాబాద్ కి రావడం చూస్తుంటే రెండో పెళ్లి ఆలోచన రేణూ దేశాయ్ విరమించుకొని ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కాబట్టి దీనిపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. 

Latest Videos

click me!