Monday Updates: `ప్రాజెక్ట్ కే` నుంచి దీపికా లుక్‌.. సోహైల్‌ మాస్‌ బీట్‌.. స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్ న్యూ డేట్‌..

First Published | Jul 17, 2023, 11:02 PM IST

`ప్రాజెక్ట్ కే` నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. మరోవైపు సోహైల్‌ మాస్‌ బీట్ తో దుమ్మురేపుతున్నారు. అలాగే `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` సినిమా కొత్త డేట్‌ వచ్చింది. `బేబీ` కలెక్షన్ల మోత మోగుతుంది. ఇలాంటి సోమవారం సినిమా అప్‌డేట్స్ చూద్దాం. 

deepika first look from project k  and sohel mass song out and monday cine updates arj

`ప్రాజెక్ట్‌ కే` నుంచి దీపికా ఫస్ట్ లుక్‌..

తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియన్‌ మూవీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ప్రాజెక్ట్ కే`. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రధారులుగా, నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్‌ చిత్రమిది. ఈ సినిమా నుంచి తాజాగా దీపికా పదుకొనె లుక్‌ని విడుదల చేశారు. ఇంటెన్స్ గా ఉన్న ఆమె లుక్‌ ఆకట్టుకుటుంది. ఇందులో `మంచి రేపటి కోసం ఒక ఆశ వెలుగులోకి వచ్చింది` అనే క్యాప్షన్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో యోధురాలుగా దీపికా నటిస్తున్నట్టు తెలుస్తుంది.  లుక్‌ మాత్రం అదిరిపోయింది. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. 
 

`మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` నుంచి సోహైల్‌ మాస్‌ బీట్‌..

మరోవైపు బిగ్‌ బాస్‌ 4 షోతో పాపులర్‌ అయిన సోహైల్‌.. తాజాగా `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైకర్‌ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మాస్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. జనరల్‌గా తెలంగాణ జానపదాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. కనకవ్వ పాడిన నరసపల్లె పాట యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్‌గా మారింది. ఆ పాటకు సోహెల్ మాస్ స్టెప్పులు వేశాడు. దీన్ని చిరంజీవి విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మిస్టర్ ప్రెగ్నెంట్ టీం తాజాగా రిలీజ్ చేసింది. అందులో సోహెల్ అదిరిపోయే స్టెప్పులు వేశారు.
 


`బేబీ` మూడు రోజులు కలెక్షన్లు..
ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన `బేబీ` సినిమా సంచలనం సృష్టిస్తుంది. భారీ కలెక్షన్లని రాబడుతుంది. ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా 23.5కోట్లు వసూలు చేసింది. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించిన ఈసినిమాని ఎస్‌కేఎన్‌ నిర్మించారు. శుక్రవారం సినిమా రిలీజ్‌ అయ్యింది. ఆదివారం కలెక్షన్లతో బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుని లాభాల్లోకి వెళ్లిందని చెప్పింది యూనిట్‌. ఈ సాయంత్రం `బేబీ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. విజయ్‌ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు. విజయం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

రిలీజ్‌ డేట్‌ మారిన `స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌`..

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది.  మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మొదట ఈ నెల 21 అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమాని మరో వారం వాయిదా వేశారు. 

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ హ్యూమరస్ గా ఉండటం, మ్యారేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ కొత్త పాయింట్ ను  చూపెట్టడం ఆసక్తిని కలిగించింది. కంప్లీట్  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి సకుటుంబంగా ప్రేక్షకులు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ తో ఉన్నారు. సినిమా టీమ్ కూడా మూవీ సక్సెస్ మీద చాలా కాన్ఫిడెన్స్  తో ఉన్నారు. ఈ నెల 29 డేట్ ను లాక్ చేసుకోమని వారు ప్రేక్షకుల్ని కోరుతున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి, యాదమ్మ రాజు, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ కీ రోల్స్  చేస్తున్నారు.

`అన్నపూర్ణ ఫోటో స్టూడియో`పై దర్శకుడు చెందు ముద్దు ఆసక్తికర కామెంట్స్..

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం `అన్నపూర్ణ ఫోటో స్టూడియో`. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. జులై 21న విడుదల కాబోతోన్న సందర్భంగా దర్శకుడు చెందు ముద్దు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలు.. `ఈ సినిమా ద్వారా ఓ స్వచ్చమైన ప్రేమ కథను చెప్పాలకున్నా. అందుకే 80ల నేపథ్యంలో కథను తీసుకెళ్లా. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రేమను వ్యక్తపరిచే విధానం మారింది. అందుకే పాత కాలంలోకి తీసుకెళ్లి కథను చెప్పాలని అనుకున్నాను. 80ల నేపథ్యాన్ని జోడించడంతోనే సినిమాకు ప్రత్యేకత చేకూరింది.

కథ పరంగా ఓ పిట్టకథకు, అన్నపూర్ణ ఫోటో స్టూడియోకు ఎలాంటి సంబంధం ఉండదు. విలేజ బ్యాక్ డ్రాప్ అన్నది మాత్రమే కామన్ పాయింట్. ఇక ఈ సినిమాలో 80ల నేపథ్యాన్ని రీ క్రియేట్ చేయడానికి చాలానే కష్టపడ్డాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు దొర్లితే క్షమించమని ప్రేక్షకులకు ముందుగానే డిస్ క్లెయిమర్‌ వేస్తున్నా. 80, 90ల నేపథ్యం కథ చెబుతున్నామా? ఎప్పటి కథ చెబుతున్నామన్నిది ముఖ్యం కాదు. మనం కథను ఎలా చెబుతున్నామన్నదే ముఖ్యం. సీతారామం సినిమా 60ల నేపథ్యంలో జరుగుతుంది. అయినా జనాలు అంతా కూడా సీతారామంను ఇష్టపడ్డారు. మనం చూపించే విధానంలోనే ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఈ జనరేషన్ వారికి ఈ సినిమా స్లో అని, పాత సినిమా అని అనిపించదు.

ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. క్లీన్‌గా ఉంటుంది. ఎక్కడా బోల్డ్ సీన్లు ఉండవు. రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. ఓ పిట్ట కథకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన ప్రిన్స్ హెన్రీని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నాను. అద్బుతమైన పాటలు ఇచ్చారు. పంకజ్ తొట్టాడ విజువల్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎంతో నిజాయితీగా ఈ సినిమాను తీశాం. చాలా క్లీన్ సినిమాను తీశాం. మీడియా సహకారం కావాలి. ఆడియెన్స్ వద్దకు ఈ సినిమాను మీడియా తీసుకెళ్లాలి. కొత్త వాళ్లను అందరూ ప్రోత్సహించాలి. అప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి.
 

Latest Videos

click me!