పట్టుచీరలో చూపులతోనే చంపేస్తున్న మల్లు బ్యూటీ.. బాపు బొమ్మలా మెరిసిపోతూ పిచ్చెక్కిస్తున్న మాళవిక అందాలు

Published : Jul 17, 2023, 09:14 PM IST

మల్లు బ్యూటీ మాళవిక మోహనన్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతుంది. తనని తాను స్టార్‌గా ఆవిష్కరించుకునే పనిలో బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజీ ప్రాజెక్ట్ లతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అసలైన రచ్చకి రెడీ అవుతుంది.   

PREV
18
పట్టుచీరలో చూపులతోనే చంపేస్తున్న మల్లు బ్యూటీ.. బాపు బొమ్మలా మెరిసిపోతూ పిచ్చెక్కిస్తున్న మాళవిక అందాలు
photo credit-malavika insta

మాళవిక మోహనన్‌.. బ్రేక్‌ కోసం చాలా కాలంగా వెయిట్‌ చేస్తుంది. థళపతి విజయ్‌, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది మాళవిక. కానీ వాళ్లు హిట్‌ ఇవ్వలేకపోయారు. పైగా ఈ బ్యూటీ పాత్రలకు పెద్దగా ప్రయారిటీ దక్కలేదు. దీంతో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది మాళవిక మోహనన్‌. 
 

28
photo credit-malavika insta

కానీ సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె బౌండరీలు బ్రేక్‌ చేసేలా గ్లామర్‌ విందు వడ్డిస్తుంది. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. మాళవిక అందాల విస్పోటనం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఇలానే ఈ బ్యూటీ ఎక్కువగా ఫేమస్‌ అయ్యింది. అందరికి తెలిసిపోయింది. 
 

38
photo credit-malavika insta

మాళవిక.. మలయాళ సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్‌ కూతురు అనే విషయం తెలిసిందే. కానీ ఎక్కడా తన పేరు వాడుకోవడం లేదు. మొదటి ఆఫర్ల విషయంలో అది వాడుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం తనని తాను మలుచుకుంటుంది. తనని తాను ఫేమస్‌ చేసుకుని ముందుకు సాగుతుందీ హాట్‌ హీరోయిన్‌. 
 

48
photo credit-malavika insta

సోషల్‌ మీడియాలో బోల్డ్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటూ నెజటిన్లని తన ఫాలోవర్స్ గా మార్చుకుంది. దీంతో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకి ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయంటే అందులో వీటి పాత్ర ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. 

58
photo credit-malavika insta

ఆ గ్లామర్‌ ఫోటోల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ పట్టుశారీలో మెరిసింది. కిల్లర్‌ పోజులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. పెద్ద కళ్లతో మరింతగా కట్టిపడేస్తుంది. మరోవైపు చూపులతోనే చంపేస్తుందీ మల్లు బ్యూటీ. 
 

68
photo credit-malavika insta

ఇందులో ఓ క్రేజీ పోస్ట్ పెట్టింది మాళవిక. కళకి సంబంధించి ఆమె స్పందిస్తూ, మన సమాజంలో కళ అనేది వస్తువులకు మాత్రమే సంబంధించినది అని, అది వ్యక్తులకు, జీవితానికి సంబంధించినది కాదని, ఆ కళ ప్రత్యేకమైన, కళాకారులైన నిపుణులచే చేయబడుతుంది, కానీ ప్రతి ఒక్కరి జీవితం కళాఖండంగా మారలేదా? దీపం, ఇళ్లు, కళావస్తువుగా ఎందుకు ఉండాలి, కానీ మన జీవితం కాదా? జీవితం ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించింది మాళవిక. 
 

78
photo credit-malavika insta

ఓ కొత్త ఆలోచనతో, ఇన్నోవేటివ్‌ ఐడియాతో మాళవిక మోహనన్‌ పెట్టిన పోస్ట్ అందరిని ఆలోచింప చేస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది. కనువిప్పుగానూ ఉంది. ప్రస్తుతం ఆమె గ్లామర్‌ ఫోటోలతోపాటు ఆమె పెట్టిన పోస్ట్ కూడా వైరల్‌ గా మారింది. అందరిని ఆకట్టుకుంటుంది. 

88
photo credit-malavika insta

ప్రస్తుతం ప్రభాస్‌తో `రాజా డీలక్స్ `లో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. సుమారు యాభై శాతం ఈ చిత్ర షూటింగ్‌ జరిగినట్టు సమాచారం. దీంతోపాటు విక్రమ్‌తో `తంగలాన్‌` సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆదివాసి మహిళగా మాళవిక కనిపించబోతుందని సమాచారం. మరోవైపు ఓ హిందీ ఫిల్మ్ కూడా రిలీజ్‌కి ఉంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories