Deepika about Ranveer: రణ్ వీర్ సింగ్ లో ఆ అలవాటు తనకు అస్సలు నచ్చదంటున్న దీపికా పదుకొనే

Published : Apr 14, 2022, 05:03 PM IST

బాలీవుడ్ లో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ తోటి స్టార్స్ ను పెళ్ళాడిన వారే.  అందులో స్పెషల్ జోడీ అనిపించుకున్నారు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే. బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనిపించుకున్న ఈ జంటలో ఓకరిలో ఒకరికి నచ్చనివి కూడా ఉన్నాయట. 

PREV
17
Deepika about Ranveer: రణ్ వీర్ సింగ్ లో ఆ అలవాటు తనకు అస్సలు నచ్చదంటున్న దీపికా పదుకొనే

బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు కేరాఫ్ గా ఉన్న స్టార్స్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే. వీరిద్దరు మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే ప్రేమలో పడ్డారు. వెంటనే  పెళ్ళి కూడా చేసుకున్నారు. పెళ్ళి తరువాత కూడా ఎవరి సినిమాలతో వారు  ఫుల్ బిజీ అయిపోయారు. 
 

27

2018 పెళ్ళి చేసుకున్న ఈ బాలీవుడ్ జంట అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీపికా కోసం అవసరమైతే ఒక మెట్టు దిగడానికి కూడా సై అంటున్నాడు రణ్ వీరు. అంతలా అర్ధం చేసుకుని, దీపిక పదుకొనే ఇష్టా ఇష్టాలకు విలువిస్తూ.. గౌరవిస్తున్నాడు. 

37

ఇక ఇంత అన్యోన్యంగా ఉండే వీరి మధ్య కూడా అప్పుడప్పుడు గొడవలు తప్పవంటుంది దీపికా. రణ్ వీర్ సింగ్ లో తనకు నచ్చనివి కూడా ఉన్నాయంటోంది. తను చేసే కొన్న పనులు బాధిస్తాయంటోంది దీపికా. 

47

దీపికా పదుకొనేను రణ్ వీర్ సింగ్ చాలా ప్రేమగా చూసుకుంటాడట. కాని రణ్ వీర్ సింగ్ లో ఓ అలవాటు తనను బాధిస్తుందట. అదేంటంటే.. బోజనం చేసేప్పుడు తాను సరదాగా మాట్లాడుకుంటూ నిధానంగా తింటూ.. ప్రేమగా తినిపించుకోవాలి అని అనుకుంటుందట. కాని ప్రతీరోజు రణ్ వీర్ దీనిని బ్రేక్ చేస్తుంటాడట రణ్ వీర్. 
 

57

తానేమో రెండు మూడు ముద్దలు తినేసరికి, రణ్ వీర్ మాత్రం ప్లేటు ఖాళీ చేసి కూర్చుంటాడట. తను చేసిన ఈ పనివల్ల చాలా సార్లు వారి మధ్య అలకలు, మాటల యుద్థాలు కామన్ గా జరుగుతుంటాయి అంటోంది దీపికా పదుకొనే. అంతే కాదు ప్రతీ రోజు తెలియకుండా ఇలా జరిగిపోతుందంటోంది. 

67

పెళ్లి తరువాత కూడా దీపికా పదుకొనే తన సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఈ మధ్య ఓ వెబ్ మూవీలో హాట్ హాట్ సీన్స్ తో అదరగోట్టింది దీపికా. పెళ్ళి తరువాత కూడా ఇదేం పని అని నెటిజన్లు విమర్షించానా కూడా ఐ డోంట్ కేర్ అంటోంది దీపికా. 


 

77

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ జోడీగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీలో నటిస్తోంది దీపికా పదుకోనే. కథ డిమాండ్ చస్తే,,. హాట్ హాట్ సీన్స్ అయినా   నటించడానికి వెనకాడనంటోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories