Karthika Deepam: శుభవార్త అంటూ పొంగిపోతున్న మోనిత.. సౌందర్య నోటి వెంట విడాకుల మాట!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 02, 2021, 09:59 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది.  ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
111
Karthika Deepam: శుభవార్త అంటూ పొంగిపోతున్న మోనిత.. సౌందర్య నోటి వెంట విడాకుల మాట!

మోనిత (Monitha) డాక్టర్ అసోసియేషన్ వేదికపై కార్తీక్ (Karthik) గురించి చెడుగా మాట్లాడడంతో వెంటనే దీప చప్పట్లు కొడుతూ వేదిక పైకి వెళ్లి మోనితను పక్కకునెట్టి మోనిత గురించి, తను చేసిన మోసాల గురించి బయట పెడుతుంది.
 

211

ఈవిడ డాక్టర్ వృత్తికే పనికి రాదని అంటూ మోనితకు తన మాటలతో పెద్ద షాక్ ఇస్తుంది. దీప (Deepa) మాటలకు మోనిత (Monitha) కోపంతో రగిలిపోతూ అక్కడినుంచి బయటకు వెళ్ళిపోతుంది.
 

311

డాక్టర్ భారతి (Bharathi) వేదిక పైకి వెళ్లి కార్తీక్ ను మాట్లాడటానికి రమ్మని ఆహ్వానించగా కార్తీక్ (Karthik) దండం పెడుతూ రాను అన్నట్లు చెప్పేసరికి ఇక వేడుక మొత్తం ముగిసిపోతుంది.
 

411

మోనిత (Monitha) బయటకు రావడంతో.. ప్రియమణి (PPriyamani) ఇవన్నీ ఎందుకమ్మా అంటూ కార్తీక్ జోలికి వెళ్ళకండి అంటూ మాటలతో మోనితను రెచ్చగొడుతుంది. వెంటనే మోనిత తనపై కోపంగా అరుస్తుంది.
 

511

అప్పుడే కార్తీక్ (Karthik) వాళ్ళు బయటకు రావడంతో మోనిత మళ్ళీ వాళ్లను తన మాటలతో కోపం తెప్పించే ప్రయత్నం చేస్తుంది. అప్పటికే కార్తీక్ కు కోపం రావటంతో సౌందర్య (Soundarya) అడ్డుపడుతుంది.
 

611

అయినా కూడా మోనిత (Monitha) తన మాటలతో రెచ్చిపోవడంతో దీప (Deepa) మోనిత దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తుండగా సౌందర్య మళ్లీ అడ్డుపడుతుంది. ఇక మోనిత ఇదంతా మీ ఇంట్లో సెటిల్ అవ్వడానికి చేస్తున్నానని అంటుంది.
 

711

ఇక సౌందర్య, దీప, ఆనందరావు (Anad rao) ఇంటికి దిగులుగా వస్తారు. ఆదిత్య (Adithya) చూసి వేడుక గురించి అడుగుతాడు. దీంతో అక్కడకు మోనిత వచ్చిందని చెప్పేసరికి తాను అక్కడికి ఎందుకు వచ్చిందని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.
 

 

811

అప్పుడే పిల్లలు సంతోషంగా వచ్చి దీపను (Deepa) స్వీట్ చేయమని అనడంతో ఆదిత్య (Adithya) పిల్లలపై కోపంగా అరుస్తాడు. దీప పిల్లలకు నచ్చజెప్పి వాళ్లను అక్కడినుంచి తీసుకెళ్తుంది.
 

911

మరోవైపు మోనిత (Monitha) దీప మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉండగా అప్పుడే లాయర్ సురేష్ (Suresh) ఫోన్ చేస్తాడు. ఇక అన్ని పనులు జరిగినట్లే అని అనడంతో సంతోషంగా ఉంటుంది. శుభవార్త అంటూ పొంగిపోతుంది.
 

1011

ప్రియమణి (Priyamani) వచ్చి దీపకు సపోర్టుగా మాట్లాడటంతో తనపై మళ్లీ గట్టిగా అరుస్తుంది. మరోవైపు దీప, సౌందర్య (Soundarya) కూర్చుని మాట్లాడుకుంటారు. నువ్వంటే చాలా ఇష్టం దీప అంటూ సౌందర్య అంటుంది.
 

1111

ఒకవేళ కార్తీక్ (Karthik) నిజంగానే ఇలాంటి పని చేసినట్లైతే వెంటనే వాడి తో విడాకులు ఇప్పించి నిన్ను నాతోనే ఉంచుకొని కంటికి రెప్పలా చూసుకునే దాన్ని అంటూ ఎమోషనల్ అవుతుంది సౌందర్య (Soundarya).

click me!

Recommended Stories