పవిత్ర లోకేష్ ని నరేష్ వివాహం చేసుకున్నాడన్న పుకార్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ కలిసి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో నరేశ్, పవిత్ర లోకేష్ వివాహం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలకు నరేష్ నేరుగానే సమాధానం చెప్పారు.