Karthika Deepam: దూరంగా వెళ్ళిపోతున్న సౌందర్య, ఆనందరావు.. దుఃఖంలో వంటలక్క, డాక్టర్ బాబు!

Navya G   | Asianet News
Published : Jan 27, 2022, 08:27 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
Karthika Deepam: దూరంగా వెళ్ళిపోతున్న సౌందర్య, ఆనందరావు.. దుఃఖంలో వంటలక్క, డాక్టర్ బాబు!

హోటల్ లో పని చేస్తున్న కార్తీక్ ను (Karthik) చూసి దీప తట్టుకోలేక డాక్టర్ బాబు (Doctor Babu) అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. మీరు ఎందుకిలా చేస్తున్నారని.. మీరు ఒక డాక్టర్ అని ఇలాంటి పనులు చేయకూడదని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళండి అంటూ.. తాను అక్కడ ఉండి పనిచేస్తుంది.
 

26

ఆదిత్య,  శ్రావ్య కారు దగ్గరికి వస్తారు. ఇక ఆదిత్య (Adhitya) తన ఫోన్ కనిపించకపోయేసరికి మోనితతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ సమయంలో ఫోన్ పక్కన పెట్టడంతో ఫోన్ పోయిందని బాధపడతాడు. ఇక ఆనందరావు (Anadharao) దగ్గరకు ఆశ్రమంలో పనిచేసే వ్యక్తి వచ్చి మీరువేరే ఆశ్రమంకు వెళ్లాలని సలహా ఇస్తాడు.
 

36

మేడం గారు రుద్రాణిని (Rudrani) కొట్టినప్పటినుంచి మీ గురించి ఎవరో ఒకరు వస్తున్నారని మీ క్షేమం కోసం గురువుగారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతాడు. ఇక దీప ఒంటరిగా కూర్చొని అప్పారావు (Apparao) మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే కార్తీక్ దీప దగ్గరికి రావటంతో అది గమనించిన దీప అక్కడి నుంచి వెళ్తుంది.
 

46

కాసేపు కార్తీక్ (Karthik) తో మాట్లాడకుండా కార్తీక్ ను బాధపెడుతుంది. ఇక కార్తీక్ ఎమోషనల్ అవ్వడం తో వెంటనే దీప (Deepa) మీరు డాక్టర్ అంటూ.. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఈ చేతులు ఇలాంటి పనులు చేయడం నేను చూడలేను అని బాగా ఎమోషనల్ అవుతుంది. కావాలంటే ఇంట్లోనే ఉండండి అని చెబుతుంది.
 

56

ఎన్నో పెద్దపెద్ద కష్టాలను ఎదుర్కొన్నామని.. ఇది అంత పెద్ద సమస్య ఏమీ కాదని.. మళ్లీ మీరు అలాంటి పనులు చేయకూడదని మాట తీసుకుంటుంది దీప (Deepa). ఇక కార్తీక్ కూడా సరే అని దీపతో నవ్వుతూ మాట్లాడుతాడు. ఇక దీప కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక చీకటి పడటంతో కార్తీక్ (Karthik) ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాడు.
 

66

ఇక అక్కడికి దీప (Deepa) రావటంతో కాస్త బాధగా మాట్లాడుతాడు. మమ్మీ, డాడీ ని చూశానని.. కాని ఈ విషయం నీకు చెప్పలేకపోయాను అని బాధపడతాడు. ఇక దీప కూడా అత్తయ్య, మామయ్య వాళ్లను చూశానని నేను కూడా చెప్పలేని పరిస్థితి అని కార్తీక్ (Karthik) తో చెప్పుకుంటూ బాధపడుతుంది.

click me!

Recommended Stories