Ram Charan: మహానటి ఉండగా చిన్న సినిమా ఎలా అవుతుంది.. గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాంచరణ్

First Published Jan 26, 2022, 10:21 PM IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం 'గుడ్ లక్ సఖి'. షూటింగ్ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతోంది. 

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. 

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం 'గుడ్ లక్ సఖి'. షూటింగ్ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతోంది. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ సినిమాను నిర్మించారు.

జనవరి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సింది. కానీ మెగాస్టార్ కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. 

దీనితో మెగాస్టార్ కి బదులుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. దీనితో ప్రీ రిలీజ్ వేడుక సందడిగా సాగింది. 

కీర్తి సురేష్ గ్రీన్ లెహంగాలో మతిపోగోట్టే అందంతో మెరిసింది. చూడ చక్కనైన రూపంతో కీర్తి సురేష్ చూపు తిప్పుకోలేని విధంగా మెరిసిపోతోంది. ఇక రామ్ చరణ్ ప్రీ రిలీజ్ వేడుకకు సింపుల్ గా హాజరయ్యారు. 

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎక్కువమంది మహిళా టెక్నీషియన్లు పనిచేశారు. 

రాంచరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నాన్నగారు రాలేకపోయారు కాబట్టి నేను ఆయన తరఫున వచ్చాను. ముఖ్య అతిథిగా రాలేదు అని చరణ్ తెలిపారు. 

చిన్న సినిమా అనే పదం నాకు ఎందుకో ఇబ్బంది కరంగా ఉంటుందని రాంచరణ్ అన్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన టెక్నీషియన్లు పనిచేశారు. మహానటి కీర్తి సురేష్ నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. అలాంటప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది అని చరణ్ తెలిపారు. 

గుడ్ లక్ సఖి చిత్రం మంచి విజయం సాధించాలని రాంచరణ్ కోరారు. రాంచరణ్ ప్రసంగం మొత్తం ఆకట్టుకుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ తో ఎవడు, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్స్ తనకున్నాయని చరణ్ గుర్తు చేసుకున్నారు. 

కీర్తి సురేష్ ఇలా లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే.. సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ చెల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!