అప్పుడు జరిగింది మొత్తం కార్తీక్ దీపకి వివరించడంతో దీప సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు అత్తయ్య గారు వచ్చారన్నారు మరి హిమ ఎక్కడ ఉంది సౌర్య ఎక్కడ ఉంది అత్తయ్య గారు సౌర్య ని వెతకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోయారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది దీప. ఏదేమైనా అమ్మ నాన్నలను కలిస్తే ఈ డౌట్లు మొత్తం తీరిపోతాయి అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత డాక్టర్ దీప రిపోర్ట్స్ రావడంతో అవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు సౌర్య,ఇంద్రుడు వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా అప్పుడు ఇంద్రుడు సౌర్య పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు దీప వాళ్ళు ఉండటం కోసం చారుశీల ఒక ఇంటిని చూపిస్తుంది.