David Warner First Telugu Speech:రాబిన్ హుడ్ సినిమాతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించపోతున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే చిత్రం ఏంటంటే.. ఈసారి ఐపీఎల్ 2025 సీజన్‌లో వార్నర్ ను ఏ ఫ్రాంఛైజీ కొనలేదు.
దాంతో ఆయన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఈసారి ను ఐపీఎల్ 2025 సీజన్‌లో వార్నర్ కనిపించడని తెలిసి ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. అయితే ఆయన ఆడియన్స్ కు మరింత చేరువయ్యేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదికూడా తనకు ఎంతో ఇస్టమైన టాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు వార్నర్.