Keerthy Suresh: ఎల్లో కలర్ చుడిదార్లో ఏమున్నావ్ కీర్తి..! ఆ నవ్వులకే ఇవ్వొచ్చు ఒక కోటి!

Published : Apr 30, 2023, 03:44 PM IST

సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేసింది కీర్తి సురేష్. ఎల్లో కలర్ చుడిదార్ లో నవ్వులు పూయించింది. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
16
Keerthy Suresh: ఎల్లో కలర్ చుడిదార్లో ఏమున్నావ్ కీర్తి..! ఆ నవ్వులకే ఇవ్వొచ్చు ఒక కోటి!
Keerthy Suresh


హీరోయిన్ కీర్తి సురేష్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఆమె లేటెస్ట్ మూవీ దసరా భారీ హిట్ కొట్టింది. ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా విడుదలైన దసరా మార్చి 30న విడుదలై మంచి విజయం సాధించింది. మహానటి తర్వాత కీర్తికి ఆ స్థాయి విజయం దసరాతో దక్కింది. 
 

26
Keerthy Suresh


కాగా కీర్తి ఈ మధ్య గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా స్కిన్ షోకి తెరలేపుతుంది. కమర్షియల్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ కి మైలేజ్ ఎక్కువ. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో రాణించడం అంత సులభం కాదు. అరుదుగా చాలా కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే మడిగట్టుకుని కూడా పరిశ్రమను శాసించారు. కీర్తి సురేష్ బోల్డ్ ఇమేజ్ కోరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.
 

36
Keerthy Suresh

సర్కారు వారి పాట మూవీకి ముందు ఆమె బాగా స్లిమ్ అయ్యారు. చెప్పాలంటే సగానికి సగం తగ్గారు. సర్కార్ వారి పాటలో కీర్తి నుండి ఆ తరహా రోల్ ఊహించలేదు. కిలాడీ లేడీగా మహేష్ నే అల్లాడించింది.తాను ఎలాంటి షేడ్స్ ఉన్న పాత్రలైనా చేయగలనని నిరూపించింది. సోషల్ మీడియా వేదికగా కీర్తి చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ వెనుక ఆంతర్యం హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ పోగొట్టుకోవడానికే కావచ్చు. 

46
Keerthy Suresh


ఇక కీర్తి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు.  ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. 
 

56
Keerthy Suresh

భోళా శంకర్ తో పాటు జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. అమెజాన్ ఒరిజినల్ చిన్ని మూవీలో సీరియల్ కిల్లర్ గా అలరించారు.తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ కీర్తి స్టార్ గా ఎదిగారు. 
 

66
Keerthy Suresh

మరోవైపు కీర్తి మీద ఎఫైర్ రూమర్స్ ఎక్కువైపోయాయి. ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. అనంతరం ఏకంగా పెళ్లైన విజయ్ తో అంటగట్టారు. అనంతరం  కీర్తి సురేష్ చిన్నప్పటి క్లాస్ మేట్ ని ప్రేమిస్తున్నారంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. అయితే ఈ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు.   
 

click me!

Recommended Stories