తమిళ స్టార్ హీరో ధనుష్.. తన మాజీభార్యపై ప్రేమను మనసులో దాచుకున్నట్టున్నాడు.. తన భార్య మనసు మార్చడానికి చూస్తున్నాడంటూ తమిళనాట వార్తలు వైరల్ అవుతుండగా.. అంతే ఘాటుగా కౌంటర్ కూడా ఇస్తుంది ఐశ్వర్య రజినీకాంత్. ఇప్పటికీ వీరు విడిపోయి విడివిడిగా ఉంటున్నారే తప్పా..విడాకులు తీసుకోలేదు.
విడాకులుతీసుకోవాలి అనుకున్నవారు.. పెద్దలు మాట్లాడి బ్రతిమలాడటంతో.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే విడాకులుతీసుకోకపోయినా.. విడివిడిగా ఎవరి బ్రతకువారు బ్రతకాలని నిర్ణయించుకున్నారట. కాగా విడాకుల నిర్ణయం ఐశ్వర్యరే అని.. ధనుష్ కు ఇంకా తన భార్యపై ప్రేమ అలానే ఉందంటున్నారు నెటిజన్లు.
ఈమధ్య లాల్ సలామ్ అనే సినిమాను డైరెక్ట్ చేసింది ఐశ్వర్య. ఈసినిమాలో తన తండ్రి.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేతే గెస్ట్ రోల్ చేయించింది. అయితే ఈమూవీ సూపర్ హిట్ అవ్వకపోయినా.. పర్వాలేదు అనిపించింది. కాగా ఈక్రమంలో ఈసినిమా రిలీజ్ కుముందు మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చేపుతూ ధనుష్ పోస్ట్ పెట్టడం.. సంచలనంగా మారింది. దాంతో ధనుష్ ప్రేమ చాలా మందికి అర్ధం అయ్యింది.
aishwarya rajinikanth
కాని ఐశ్వర్య మాత్రంగట్టిగా డిసైడ్ అయినట్టుంది. ఏమాత్రం ఆలోచన మార్చుకునేలా కనిపించడంలేదు. ఈక్రమంలో లాల్ సలామ్ మూవీ ప్రమోష్ల సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది ఐశ్వర. ఈసందర్భంగా ఈ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు ఒంటరి జీవితమే చాలా బాగుందంటోంది. ప్రస్తుతం హాయిగా బ్రతుకుతున్నాను అంటోంది ఐశ్వర్య.
ఆమె మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లుగా నేను ఒంటరిగానే జీవిస్తున్నాను. అయితే ఈ సింగిల్ లైఫ్ ను ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నాను. ఈ రెండు సంవత్సరాల్లో నేను గ్రహించిన విషయం ఏంటంటే? మనం ఒంటరిగా ఉన్నప్పుడే మరింత సురక్షితంగా ఉండగలం. ప్రస్తుతం నాకు ఇలాగే బాగుంది. పిల్లల కోసం గతంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. కానీ ప్రపంచం చాలా ఫాస్ట్ గా పరిగెడుతోంది. అసలు టైమే తెలియడం లేదు. అన్నారు ఐశ్వర్య.
అంతే కాదు ఇలా సింగిల్ లైఫ్ ను లాక్కురావడమే ఈజీగా ఉంది” అంటూ.. పరోక్షంగా.. ధనుష్ తోమళ్లీ కలిసేది లేదు అన్నట్టుగా షాకింగ్ కామెంట్స్ చేసింది ఐశ్వర్య రజినీకాంత్. దాంతో వీరిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా అని ఎదరు చూస్తున్న కుటుబ సభ్యులకు.. రజినీకాంత్, ధనుష్ ఫ్యాన్స్ కు ఈ వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి.
Aishwarya Rajinikanth Marriage
అంతే కాదు ఇలా సింగిల్ లైఫ్ ను లాక్కురావడమే ఈజీగా ఉంది” అంటూ.. పరోక్షంగా.. ధనుష్ తోమళ్లీ కలిసేది లేదు అన్నట్టుగా షాకింగ్ కామెంట్స్ చేసింది ఐశ్వర్య రజినీకాంత్. దాంతో వీరిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా అని ఎదరు చూస్తున్న కుటుబ సభ్యులకు.. రజినీకాంత్, ధనుష్ ఫ్యాన్స్ కు ఈ వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి.
అంతే కాకుండా, అతను ఐశ్వర్య డైరెక్ట్ చేసిన సెకండ్ మూవీ వై రాజా వాయ్‌లో కొక్కి కుమార్‌గా అతిధి పాత్రలో కనిపించాడు.ధనుష్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ఐశ్వర్య.. 2022లో ధనుష్ కు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి హఠాత్తుగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తరువాత ధనుష్ కూడా తన సోషల్ మీడియా పేజీలో కన్ ఫార్మ్ చేశాడు.