భార్యతో సంగీత దర్శకుడు విడాకులు.. మా మధ్య విలన్ ఎవరో తెలుసు, స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు

First Published | Nov 8, 2023, 12:58 PM IST

రెండేళ్ల క్రితం ప్రముఖ సంగీత దర్శకుడు డి ఇమాన్ తన మాజీ భార్య మోనికా రిచర్డ్ నుంచి విడాకులు పొందిన సంగతి తెలిసిందే. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. 

D Imman

రెండేళ్ల క్రితం ప్రముఖ సంగీత దర్శకుడు డి ఇమాన్ తన మాజీ భార్య మోనికా రిచర్డ్ నుంచి విడాకులు పొందిన సంగతి తెలిసిందే. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అప్పట్లో ఇమాన్ ఈ వార్త ప్రకటించడం సంచలనంగా మారింది.  ఇమాన్, మోనికా 13 ఏళ్ల వివాహ బంధానికి తెరపడినట్లు అయింది.

అయితే వీరిద్దరి విడాకుల ఎపిసోడ్ అంత సాఫీగా సాగలేదు. ఇమాన్, మోనికా విడాకుల విషయంలో ఒక స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్. తమిళంలో శివకార్తికేయన్ వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇమాన్, శివకార్తికేయన్ మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. 


ఈ రూమర్స్ ని బలపరుస్తూ.. తాను ఇక శివకార్తికేయన్ చిత్రాలకు పని చేయను అని ఇమాన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ వ్యాఖ్యలపై మరోసారి ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇమాన్ స్పందించారు. మంచి చెడు మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. మీ జీవితంలో విలన్ ఎవరో మీరు తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇమాన్, శివకార్తికేయన్ మధ్య ఎందుకు వివాదాలు మొదలయ్యాయి. అసలు ఇమాన్ ఫ్యామిలీతో శివకార్తికేయన్ కి ఏంటి సంబంధం ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను శివకార్తికేయన్ తో ఇక పనిచేయను అని ఇమాన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతడి మాజీ భార్య మోనికా గురించి కూడా చర్చ జరిగింది. దీనితో శివకార్తికేయన్, మోనికా గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం మొదలైంది. 

దీనితో మోనికా స్వయంగా స్పందించింది. శివకార్తికేయన్ తో పనిచేయకపోవడం అనేది ఇమాన్ వ్యక్తిగత విషయం. దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. శివకార్తికేయన్ చాలా మంచి వ్యక్తి. మంచి స్నేహితుడు. మా విడాకుల సమయంలో మేమిద్దరం కలసి ఉండేందుకు.. విడాకులని నివారించేందుకు శివకార్తికేయన్ చాలా ప్రయత్నించారు అని మోనికా పేర్కొంది. ఇప్పుడు ఈ విషయాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తూ వైరల్ చేస్తున్నారు అని మోనికా పేర్కొంది. 

ఇదంతా గమనిస్తే మోనికా, ఇమాన్, శివకార్తికేయన్ మధ్య ఏదో తీవ్ర వివాదమే సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నా జీవితంలో విలన్ ఎవరో తెలుసుకున్నా అంటూ ఇమాన్ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ మరింత వివాదంగా మారింది. ఇమాన్ 2002లో ఇళయదళపతి విజయ్ నటించిన 'తమిళన్' చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు. ఇటీవల ఇమాన్.. అజిత్ 'విశ్వాసం'.. రజనీకాంత్ 'అన్నాత్తే' చిత్రాలకు మ్యూజిక్ అందించారు. 

Latest Videos

click me!