కత్తి మహేష్ - వివాదాలు, విమర్శలు

First Published Jul 10, 2021, 7:24 PM IST

పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ, వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేస్తూ సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. పవన్ అభిమానులు దీన్ని తీవ్రంగా నిరసించారు. కొందరు ఆయనపై భౌతికంగా దాడి చేయటానికి ప్రయత్నించారు. అసలు కత్తి మహేష్ అంటేనే వివాదం అనేంత స్థాయిలో ఆయన మాటతీరు రావడానికి.. ఆయన వివదాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. 

కత్తి మహేష్ ఈ పేరు వింటే చాలు.. ఎంతోమంది మొహం మీద విసుగు కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మొదలు రామ భక్తుల వరకు దుమ్మెత్తి పోస్తారు. అనేక సందర్భాల్లో, అనేక విమర్శలు.. దానికి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్..రాష్ట్ర బహిష్కరణలు ఇలా ఎన్నో వివాదాలు ఆ పేరు చుట్టూ...
undefined
తను నమ్మిన విశ్వాసాలను కత్తి మహేష్ ధైర్యంగా ప్రకటించేవాడు. అలా చేసినందుకు ముప్పేట దాడిని ఎదుర్కున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ లో కత్తి మహేష్ ఎదుర్కున్నంత అబ్యూస్ ఇంకెవరూ ఎదుర్కోలేదు అంటే అతిశయోక్తి కాదేమో. నెలల తరబడి తిట్లు, శాపనార్థాలు, బాడీ షేమింగ్, భౌతిక దాడులు జరిగినా కత్తి మహేష్ జంకలేదు. తన భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకుని నిర్భీతిగా తాను నమ్మిందే వివిధ వేదికల మీద ప్రకటించాడు.. అలాంటి కత్తి మహేష్ ఈ రోజు మన మధ్య లేరు. నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు..
undefined
మరి ఇంతకీ ఈ కత్తి మహేష్ ఎవరు.. అంటే..2006 టైంలో వచ్చిన తెలుగులో బ్లాగు విప్లవం సమయంలో "పర్ణశాల" అనే పేరుతో బ్లాగ్ మొదలు పెట్టి ఎంట్రీ ఇచ్చాడు. కత్తి మహేష్ మొదలుపెట్టిన ఆ బ్లాగ్ అప్పట్లో ఒక సంచలనం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుని, యూనిసెఫ్ లో కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా పనిచేసి, పర్ణశాల బ్లాగు ద్వారా సమాజంలో అసమానతల మీద, మూఢ విశ్వాసాల మీద, దళిత ఐడెంటిటీ మీద, అనేక రాజకీయార్థిక అంశాల మీద ప్రభావవంతమైన వందల ఆర్టికల్స్ రాశాడు కత్తి మహేష్. "నవతరంగం" వెబ్ పోర్టల్ లో సినిమా గురించి లోతైన పరిశీలనా వ్యాసాలు రాశారు.
undefined
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీ లో పట్టభద్రుడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామం. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఎడారి వర్షం అనే కథను ఆధారం చేసుకుని ఊరు చివర ఇల్లు అనే లఘు చిత్రం తీశారు.. మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించారు. పెసరట్టు సినిమాను క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన హృదయ కాలేయంలో ఓ చిన్న పాత్ర పోషించారు. పలు ప్రసార మాధ్యమాలలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ మహేష్ దుమారం రేపారు. పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శనాస్త్రాలను సంధించడానికి ఫేస్ బుక్ ను, ట్విట్టర్ ను వేదికలుగా మార్చుకున్నారు.
undefined
పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ, వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేస్తూ సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. పవన్ అభిమానులు దీన్ని తీవ్రంగా నిరసించారు. కొందరు ఆయనపై భౌతికంగా దాడి చేయటానికి ప్రయత్నించారు. అసలు కత్తి మహేష్ అంటేనే వివాదం అనేంత స్థాయిలో ఆయన మాటతీరు రావడానికి.. ఆయన వివదాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.
undefined
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కత్తి మహేష్‌పై హైదరాబాద్‌లో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హైదరాబాద్ నుంచి కత్తి మహేష్‌ను బహిష్కరించారు. స్వయంగా తెలంగాణ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి కత్తి మహేష్‌పై 6నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నుంచి ఏపీలోని మహేష్‌ స్వస్థలమైన చిత్తూరు జిల్లా యల్లమందలో విడిచి పెట్టారు. అయితే అక్కడ కూడా ఆయన కారణంగా శాతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమో అనే అనుమానంతో మహేష్ ని బెంగళూరుకు తరలించారు.
undefined
బిగ్ బాస్ 1 లో పార్టిసిపెంట్ గా చేసిన కత్తి మహేష్ బిగ్ బాస్ 2 కౌశల్ మీద, కౌశల్ ఆర్మీ మీదా విరుచుపడ్డాడు. ''అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. బిగ్ బాస్ కి వచ్చిన తరువాత అందరూ కుటుంబ సభ్యుల్లా మెలగాలి. హౌస్ మేట్స్ లో కొందరు కొందరికి నచ్చోచ్చు, నచ్చకపోవచ్చు అలా అని ట్రోల్ చేస్తారా..?. తమకి నచ్చని వారిపై కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం కరెక్ట్ కాదు. కౌశల్ కి ఉన్నట్లే మిగిలిన కంటెస్టెంట్స్ కి కూడా కుటుంబాలు ఉంటాయి. వారికి ఈ ట్రోలింగ్ లు బాధ కలిగిస్తాయి. కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోంది. అసలు ఈ కౌశల్ ఆర్మీ ఎవరికి సైన్యం..? ఎవరి కోసం సైన్యం..? అనేది అర్ధం కావడం లేదు. ఎవరీ కౌశల్.. బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండొచ్చు.. నాకు నచ్చలేదు అలాగని ట్రోల్ చేస్తారా..? ఇటీవల ఆయన పేరు మీద 2కె రన్ చేశారు.కేరళ వరద బాధితుల కోసం అలా చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అంది ఉండేవి'' వెల్లడించారు. 'చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం కౌశల్ చెప్పాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అతడు చికాకు తెప్పించే వ్యక్తి' అని చెబుతూ.. తాజాగా మరొక పోస్ట్ పెట్టారు. 'కౌశల్ బిగ్ బాస్ 2 లోనే చాల విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్ బాస్ 2 టైటిల్ గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనే విషయం ప్రూవ్ అవుతుంది' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
undefined
పవన్ మాటెత్తితేనే విరుచుకుపడే కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పవన్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. పవన్ తనకి ప్రాణహాని ఉందని చెప్పడం ఆయన రాజకీయ పరిణతిని తెలియజేస్తుందని అన్నారు. శ్రీరెడ్డి ఉదంతం జరిగినప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించాలని వెల్లడించిన పవన్ తనపై కుట్ర జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదని ప్రశ్నించారు.
undefined
ఏపీ ప్రతిక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై కూడా సినీ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శలు చేశారు. ‘‘ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మన ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకరంగా ఉంది. హత్యారాజకీయాల నేపథ్యం ప్రజాస్వామ్యానికి హానిచేస్తుందనిపిస్తోంది. జగన్ పై దాడి జరిగిందన్న విషయం కన్నా.. టీడీపీ నేతలు స్పందించిన తీరు నన్ను షాకింగ్ కి గురిచేసింది. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా? ఎలాంటి విచారణ చేపట్టకుండా డీజీపీ స్టేట్ మెంట్ ఇవ్వడం షాకింగ్ గా అనిపించింది.’’‘‘చంద్రబాబు కనీసం జగన్ కి ఫోన్ చేసి ఉంటే ఆయన స్థాయి పెరిగిపోయేది. కానీ తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన చౌకబారు మాటలు వింటే.. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తోంది. జగన్ తల్లీ, చెల్లీ దాడి చేయించారంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వింటే... ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జంతువు అనే అనుమానం కలిగింది’’ అంటూ కత్తి మహేష్ ఘాటుగా స్పందించాడు.
undefined
ఎదో ఒక విషయంలో పవన్ పేరును ప్రస్తావించే కత్తి మహేష్ మరోసారి డిఫరెంట్ గా కామెంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ గురించి చెబుతూ జనసేన పార్టీ గెలుపుపై ఊహించని విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనసేన 3 నుంచి ఏడూ సీట్లు మాత్రమే గెలుస్తుందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది."కాంగ్రెస్ వ్యతిరేకత.రాజకీయ శూన్యత. కమ్మ కుల అధికార దాహం. ఎన్. టి.రామారావు చరిష్మా. ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీపెట్టిన ఎనిమిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తెలివి శూన్యత. కొణిదెల బ్రదర్స్ఫ్యామిలీ పై అపనమ్మకం. కాపు కుల అనైక్యత. రాజకీయ సంవృధ్ది(బాబు, జగన్) కలగలిపి పవన్ రాజకీయాలలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా, జనసేన 3 నుంచి 7 సీట్లకు మించి గెలవదు" అంటూ కత్తి మహేష్ పేర్కొన్నాడు.
undefined
రీసెంట్ గా పవన్ ఆదాయానికి సంబందించిన కామెంట్ గురించి కత్తి మహేష్ ఫెస్ బుక్ నుంచి ఒక పోస్ట్ వెలువడింది. గత కొన్ని రోజులుగా పవన్ తన పర్యటనలలో జనాలను ఉద్దేశిస్తూ మీ కోసం 100ల కోట్ల ఆదాయాన్ని వదిలేసుకొని వచ్చాను అని వివరణ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై కత్తి ఈ విధంగా కామెంట్ చేశాడు."రూ. 100 కోట్ల ఆదాయాన్ని మీకోసం వదులుకున్నా.. ఇక మీరే తేల్చుకోండి" : పవన్ కళ్యాణ్ లేని ఆదాయాన్ని.రాని ఆదాయాన్ని ఎట్లా వదులు కుంటావ్ పవన్? ఇప్పటివరకూ నీకొచ్చిన అత్యధిక రెమ్యునరేషన్ అజ్ఞాతవాసికి 25 కోట్లు. అలాంటి సినిమాలు నాలుగు చేస్తేగానీ సంవత్సరానికి వందకోట్లు కావు.అదే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం+బిజెపికి నువ్వు చేసిన నాలుగు నెలల ఆర్భాటానికి ప్రచారానికి నీకు ఎంత గిట్టుబాటు అయిందో ఖచ్చితంగా తెలిదుగానీ. తప్పకుండా 100 కోట్ల పైనే అని ఒక అంచనా. కాబట్టి సినిమాల్లో ఆదాయం వదులుకుని నువ్వు రాలేదు. రాజకీయాలలో డబ్బు చేసుకోవడానికి నువ్వు వచ్చావు. మీ అన్న అమ్ముకున్న సీట్లు, పార్టీకి నువ్వొక కొనసాగింపు. అంతే! కాబట్టి ఆదాయాలు.త్యాగాల గురించి మాట్లాడకు" అని మహేష్ ఫెస్ బుక్ లో పేర్కొన్నారు.
undefined
సీఎం అవుతాను అని పవన్ జనాల్ని ఉద్దేశించి మాట్లాడగా దానిపై కత్తి డిఫరెంట్ గా కామెంట్ చేశాడు. "పిఠాపురంలో జనం సీఎం అని నాకోసం నినదిస్తే, అది శ్రీపాద వల్లభుడి ఆశీర్వాదమే. నేను సీఎం అయిపోతాను." అని పవన్ కళ్యాణ్ అంటే.."ఇదేమన్నా సినిమా ఫంక్షన్ అనుకున్నావా బాబూ! జనం అరిస్తే, దేవుడు దయతలిస్తే హిట్ అయిపోవడానికి. సినిమాక్కూడా కథ బాగుండాలి. బాగా తియ్యాలి. రాజకీయంలో నువ్వేమిటో తెలియాలి. ఏం చేస్తావో చెప్పాలి. అది చెయ్యగలనని నమ్మించాలి. నీ తరఫున నిలబడిన వాళ్ళు మెజారిటీ గెలవాలి. అప్పుడు నువ్వు సీఎం అవుతావ్. తెలుసుకో!" అంటూ కత్తి మహేష్ కౌంటర్ ఇచ్చాడు.
undefined
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మనూ కత్తి మహేష్ వదలలేదు. నాదెండ్ల మనోహర్ విషయంలో పవన్ జాగ్రత్తగా ఉండాలని, పవన్ ని వెన్నుపోటు పొడవడానికి నాదెండ్ల సిద్ధమవుతున్నాడని.. ఆ విషయాన్ని పవన్ అభిమానులు ఆయనకి సూచించాలని వివాదాస్పద కామెంట్స్ చేసిన ఆర్జీవీకి.. ''నాదెండ్ల మనోహర్ గురించి రాంగోపాల్ వర్మ చెప్పింది నిజమే! పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు. పవన్ కళ్యాణ్ కూడా కసాయవాడిని నమ్మే...అదే!. కాకపోతే వర్మగారు అంత త్వరగా నిజాలు బయటికి చెప్పి ట్రూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపించారు. అది నాకు నచ్చలేదు. నాకన్నా పెద్ద ఫ్యాన్ పవన్‌కి ఎవరూ ఉండకూడదు. వర్మతో సహా..'' అంటూ సెటైరికల్ గా పోస్ట్ పెట్టాడు. అలానే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో వర్మ విడుదల చేసిన 'వెన్నుపోటు' పాటపై కామెంట్స్ చేస్తూ.. 'ఈ రేంజిలో డైరెక్ట్ ఎటాక్ ఒక్క రామ్ గోపాల్ వర్మకే సాధ్యం' అంటూ స్పందించారు.
undefined
మెట్రో స్టేషన్ లోని లిఫ్ట్ ని.. ఇటీవల కొందరు యువతీ యువకులు రొమాన్స్ కి అడ్డాగా మార్చుకున్నారు. ఈ వీడియోలు లీక్ అవ్వడంతో దీనిమీద స్పందిస్తూ..‘‘లిఫ్టులో 'ముద్దా'యిల వీడియోలు ఇప్పుడే ఒక ఛానెల్ లో చూస్తున్నాను. ఆ వీడియోలో అమ్మాయిలు చూపిన చొరవ అభినందనీయం. పార్కుల్లో,థియేటర్లలో నిషేధాలు విధిస్తే మెట్రో లిఫ్టుల్ని యువత క్రియేటివ్ గా వాడటం ముదావహం.ఈ వైఖరుల్ని నిరసిస్తున్న సంఘాలని మీడియాని నేను ఖండిస్తున్నాను.’’ అంటూ పోస్టు చేశారు.
undefined
సింగర్‌ సునీత్‌ రెండో పెళ్లిపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ విమర్శలు గుప్పించారు.ఆయన స్పందిస్తూ, సునీత ఆనందంగా ఉన్న ఫోటోని పంచుకుంటూ `ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఏదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్దరించడానికి మ్యారేజ్‌ చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి, ఆదుకోవడానికి మ్యారేజ్‌ చేసుకుంటారు. ఇలా సుఖం కోసం, ఆనందాల కోసం, ఆర్బాటంగా పెళ్లి చేసుకుని హ్యపీగా కనిపిస్తే.. హమ్మో ఎంత కష్టం` అంటూ తన దైన స్టయిల్‌లో సెటైర్లు పేల్చాడు.రెండో పెళ్లి అంటూ చాటు మాటున చేసుకుని, గిల్టీగా ఫీలవుతుంటారు. కానీ వీరిలో ఇంత హ్యాపీనెస్‌ ఏంటీ?ఆ కళల్లో ఆనందం ఏంటి?, ఆ వెలుగేంటి? ఎట్టా ఇలా అయితే, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. సొసైటీ నాశనమైపోదా. ` అంటూ ఫేస్‌బుక్‌లో తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేశాడు కత్తిమహేష్‌.
undefined
వెకిలి కామెడీ షో `జబర్దస్త్`ని రోజా వదిలేయాలని, అప్పుడే ఆమెకి సరైన గౌరవం దక్కుతుందని కత్తి మహేష్ ఎద్దేవా చేశాడు. `రోజా గారు ఎమ్మెల్యేగా ఎన్ని చేసినా... తనకి అప్పగించిన కార్పొరేషన్ విధులు తూచతప్పకుండా నిర్వర్తించినా.. 'జబర్దస్త్' లాంటి వెకిలిషోలో ఇకిలించడం మానకపోతే రావాల్సిన గౌరవం రాదు. దక్కాల్సిన మంత్రిపదవి దక్కదు. ప్రోటోకాల్ కోసం ప్రివిలేజ్ కమిటీకి పోయినా వచ్చేది నిజమైన గౌరవం అయితే కాదుగా.. గౌరవం ఇవ్వమని డిమాండ్ చేయకూడదు.. ఆదేశించాలంతే` అని సలహాలిచ్చారు.
undefined
‘అప్పట్లో ప్రజారాజ్యం సమయంలో హీరో జీవితారాజశేఖర్ దంపతుల మీద దాడి చేయించింది. జనసేన హయాంలో నా మీద ఒక మహిళతో తప్పుడు ఆరోపణలు చేయించింది.. ప్రముఖ నిర్మాత బన్నీ వాసుగారని తెలిసింది. అందులో ఎంత నిజం ఉందో వారి మనస్సాక్షికే తెలియాలి. వారికి నా అభినందనలు. ధన్యవాదాలు’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు కత్తి మహేష్. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.2018లో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతున్నప్పుడు కత్తి మహేష్.. ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో పాల్గొనగా.. సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్ అదే చర్చలో పాల్గొని కత్తి మహష్‌పై లైంగిక ఆరోపణలు చేయటం జరిగింది. తనను మహేష్ కత్తి ఇంటికి పిలిపించుకుని మరీ బలవంతం చేశాడని చెప్పింది. ఓ టీవీ ప్రోగ్రామ్ కోసం అతనితో మాట్లాడటానికి వెళ్లానని ఆ సమయంలో నన్ను బలత్కారం చేశాడని.. అడ్డుకోబేతే నన్ను కొట్టి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తరువాత తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడని చెప్పింది. ఇప్పుడు కత్తి మహేష్ ఈ రెండు విషయాలను గుర్తు చేసారు తన పోస్ట్ ద్వారా. అయితే అదే అమ్మాయి సునీత బోయ.. గత కొంతకాలంగా నిర్మాత బన్నీ వాసుపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
undefined
click me!