తల్లి కాబోతున్న అనసూయ... ఇది సాహసమే?

First Published | Feb 2, 2024, 7:24 PM IST

అనసూయ గురించి ఓ సంచలన న్యూస్ వైరల్ అవుతుంది. అదే నిజమైతే పెద్ద సాహసమే అని చెప్పాలి. మరి ఆ మేటర్ ఏమిటో చూద్దాం.. 
 

Anasuya bharadwaj

అనసూయ బోల్డ్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుంది. ఎవరేమన్నా ఐ డోంట్ కేర్ అంటుంది. అనసూయ పలు వివాదాల్లో ఇరుక్కుంది. అయితే ఆమె వెనక్కి తగ్గింది లేదు. వందల మంది హేటర్స్ ని సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేస్తుంది. 


ఆన్ స్క్రీన్ మీద కూడా అనసూయ ఇదే బోల్డ్నెస్ కొనసాగిస్తోంది. వేశ్య పాత్ర చేయడానికి కూడా ఆమె సిద్ధం. గత ఏడాది విడుదలైన విమానం మూవీలో అనసూయ వేశ్యగా సాహసోపేతమైన పాత్ర చేసింది. సాధారణంగా వేశ్యగా నటించేందుకు చాలా మంది నటులు జంకుతారు. 


Anasuya bharadwaj

కాగా అనసూయ మరోసారి తల్లి కాబోతున్నారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ఆమె నిజ జీవితంలో కాదు. ఓ సినిమాలో ఆమె స్టార్ హీరో తల్లిగా కనిపించనున్నారట. హీరో బాల్యంలో వచ్చే సన్నివేశాల్లో అనసూయ తల్లిగా చేస్తున్నారు. ఓ బడా ప్రాజెక్ట్ కి ఆమె సైన్ చేశారని అంటున్నారు. 
 

Anasuya bharadwaj

అనసూయ తల్లిగా కనిపించడం సాహసమే అని చెప్పాలి. కారణం ఆమెకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో లీడ్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోకి తల్లిగా నటిస్తే అనసూయ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. 
 

అదే సమయంలో అనసూయ ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే అనసూయ తల్లి పాత్ర చేస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అనసూయ నెక్స్ట్ పుష్ప 2 మూవీలో దాక్షాయిణిగా లేడీ విలన్ పాత్రలో సందడి చేయనుంది. 

కాగా అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం తెలిసిందే. పూర్తిగా నటనపై దృష్టి పెట్టింది. అనసూయ పలు వైవిధ్యమైన పాత్రల్లో అలరిస్తుంది. గత ఏడాది అనసూయ  రంగమార్తాండ, విమానం, ప్రేమ విమానం, పెదకాపు 1 చిత్రాల్లో నటించింది. 

Latest Videos

click me!