బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ Hrithik Roshan - దీపికా పదుకొణె Deepika Padukone జంటగా వచ్చిన చిత్రం ‘ఫైటర్’ Fighter Movie. భారీ అంచనాలతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.
ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ Siddharth Anand దర్శకత్వం వహించారు. ఆయన నుంచి గతంలో ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో ‘ఫైటర్’పై భారీ అంచనాలు ఉండగా... సినిమా మాత్రం హైప్ ను రీచ్ కాలేకపోయింది.
అయితే, తాజాగా ఈ సినిమా ఫలితంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. ఈ సందర్భంగా కొంత వివాదాస్పందంగా కామెంట్స్ చేశారు....ఆయన కామెంట్స్ తో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆయన్ని పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ ఆయనేమన్నాడేనిది చూస్తే.. ‘ఇప్పటి వరకు ఇలాంటి కథతో సినిమా రాలేదు. చాలా కొత్తగా తీశాం. గతంలో ఆడియెన్స్ ఎప్పుడూ చూడని మూవీ ఇది. అందుకే యుద్ధ విమానాల ప్రదర్శన వింత అనిపిస్తుంటుంది. అలాగే మన దేశంలో 90 శాంత మంది విమానం ఎక్కే ఉండరు. ఎయిర్ పోర్టు కూడా చూసి ఉండరు.
అలాంటి వారికి ఈ సినిమాలో ఏం జరుగుతుందనేది ఎలా అర్థమతుంది? అందుకే ఆకాశంలో యుద్ధ విమానాలతో చేస్తే స్టంట్స్ కు కనెక్ట్ కాలేకపోయారు. కానీ మనస్సు పెట్టి సినిమాను చూస్తే అర్థమవుతుంది.’ అంటూ కామెంట్స్ చేశారు.
ఆయన వ్యాఖ్యలకు నెటిజన్లు మండిపడుతున్నారు. ‘విమానం ఎక్కపోవడానికి.. సినిమా అర్థం కాకపోవడానికి లింకేంటీ.. అయినా అర్థమయ్యేలా సినిమా తీయడం నేర్చుకోవాలని ఫస్ట్ అంటూ’ రిప్లై ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన వీడియో నెట్టిం వైరల్ గా మారింది.