ఆ సూపర్ హిట్ సినిమాలో చిరుని తీసేసి మోహన్‌బాబుని తీసుకున్నారా, షాకింగ్ !

First Published | Nov 29, 2024, 12:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో 'కొండవీటి సింహం' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను వదులుకున్నారు. ఐదు రోజుల షూటింగ్ తర్వాత, ఆ పాత్ర మోహన్ బాబుకు వెళ్ళింది. చిరంజీవి నెగిటివ్ పాత్రలకు దూరంగా ఉండాలని భావించడమే ఇందుకు కారణం.

Chiranjeevi, ntr, mohan babu, Kondaveeti Simham


కొన్ని సినిమా సంగతులు కొన్నేళ్ల తర్వాత కూడా ఆశ్చర్యపరుస్తూంటాయి. ముఖ్యంగా ఇవాళ స్టార్స్ గా వెలుగుతున్న హీరోలు కెరీర్ ప్రారంభదశలో చేసిన సినిమాలు, వదులుకున్న పాత్రలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్స్ అప్పటినుంచి ఇప్పటిదాకా వెలుగుతూనే ఉన్నారు. వారి కెరీర్ ప్రారంభం నాటి ముచ్చట్లు ఇప్పటికి ఫ్యాన్స్ కు పండగే. అలా చిరంజీవి కెరీర్ ప్రారంభ రోజుల్లో జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 


మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఎక్కడా ఆగకుండా రోజు రోజుకూ మరింత అద్బుతంగా మారుతూన్న సంగతి  తెలిసిందే.67 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు. బ్లాక్ బస్టర్లు కొడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు  హిట్టైతే  రూ.100 కోట్లు, రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తూనే ఉన్నాయి.

తెలుగులో యంగ్ హీరోలకు సైతం పోటి ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసి దూసుకుపోతున్నారు.  అలాంటి చిరంజీవి కెరీర్ ప్రారంభ దశలో ఆయన చేయాల్సిన పాత్ర ఓకే అనుకున్న తర్వాత మోహన్ బాబుకు వెళ్లిందిట. 
 

Latest Videos



చెన్నై వెళ్లి యాక్టింగ్ కోర్సు చేసిన చిరంజీవి.. ఆఫర్ల కోసం చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.  తన ప్రతిభతో అందరినీ మెప్పించి  ఆయన నటుడిగా నిలదొక్కుకుంటున్న టైంలో.. ‘కొండవీటి సింహం’ సినిమాలో అవకాశం వచ్చింది.

5 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నారు చిరు. కానీ తర్వాత చిరుని తప్పించి మోహన్ బాబుని తీసుకుందట చిత్ర టీమ్ అని చెప్తారు. అందుకు కారణం చిరంజీవి నెగిటివ్ పాత్రల నుంచి అప్పటికే తప్పుకుని సోలో హీరోగా ఎదగాలనే ఆలోచనతో ఉండటంతో మనస్పూర్తిగా చేయలేకపోయారట.


 దాసరి ‘సర్దార్‌ పాపారాయుడు’  సంచలన విజయం తరువాత ఎన్టీఆర్‌ చేసిన అలాంటి మరో తండ్రీ కొడుకుల డ్యుయల్‌ రోల్‌ బాక్సాఫీస్‌ హిట్‌ – ‘కొండవీటి సింహం’. 1981 అక్టోబర్‌ 7న రిలీజైంది ఈ చిత్రం. చిరంజీవి ‘కొండవీటి సింహం’ సినిమాలో ఎన్టీఆర్ కు కొడుకుగా నటించాలి.

పాటలు, డ్యాన్సులు, విలన్‌ తరహా పాత్రలతో పేరు తెచ్చుకుంటున్న చిరంజీవి పేరుతో సహా తారాగణం వివరాల పత్రికా ప్రకటన కూడా చేశారు. స్క్రిప్టులో హీరోయిన్‌ గీత టైప్‌మిషన్‌ దగ్గర ఐ లవ్యూ చెప్పే సీన్‌లో ఒక డ్యూయెట్‌ కూడా అనుకున్నారు. 


అదే సంవత్సరం చిరంజీవి ఎన్టీఆర్ తో ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో కలిసి నటించారు.  ‘కొండవీటి సింహం’ చిత్రానికి కూడా కె.రాఘవేంద్రరావు గారే దర్శకుడు. కానీ ‘కొండవీటి సింహం’ లో కొడుకు పాత్ర అనే సరికి చిరంజీవి .. పాజిటివ్ రోల్ అనుకున్నారట.కానీ తండ్రిని ఎదిరించే పాత్ర అది.

ఎన్టీఆర్ కు ధీటుగా చిరంజీవి డైలాగులు చెప్పాల్సి రావటం, నెగిటివ్ పాత్ర కావటంతో ఉత్సాహంగా ముందుకు వెళ్లలేక 5 రోజుల అనంతరం తప్పుకున్నారట .అప్పుడు ఆ ప్లేస్ లోకి మోహన్ బాబుని తీసుకున్నారట.  అలా ‘కొండవీటి సింహం’లోని నెగటివ్‌ పాత్రకు చిరంజీవి బదులు మోహన్‌బాబును తీసుకున్నారు. చిరంజీవి కోసం అనుకున్న డ్యూయెట్‌ను కూడా స్క్రిప్టులో నుంచి తొలగించేశారు. 


 1981 అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా రిలీజైన ‘కొండవీటి సింహం’ చిత్రం అపూర్వ విజయం సాధించింది. సినిమా ప్రదర్శన హక్కులు కొన్న ప్రతి ఒక్కరికీ పెట్టిన రూపాయికి అయిదు నుంచి పది రూపాయల లాభం రావడం అప్పట్లో సంచలనం.కర్తవ్యనిర్వహణ అనే మాస్‌ ఎలిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ – రెండింటినీ రంగరించిన చిత్రం ఇది. ఎస్పీ రంజిత్‌ కుమార్‌గా తండ్రి పాత్రలో ఎన్టీఆర్‌ గంభీరమైన నటనకు జనం జేజేలు పలికారు. 


ఆ రోజుల్లో 47 ప్రింట్లతో, 43 కేంద్రాల్లో ‘కొండవీటి సింహం’ రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో క్రిక్కిరిసిన ప్రేక్షకులతో 70 రోజులాడింది. అప్పటికి అత్యధికంగా 37 కేంద్రాలలో వంద రోజులు జరుపుకొంది. ఏకంగా 15 కేంద్రాల్లో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది.

వైజాగ్‌లో షిఫ్టులతో 315 రోజులు ప్రదర్శితమైంది. అలాగే, లేట్‌ రన్‌లో సైతం ఈ బాక్సాఫీస్‌ సింహం దాదాపు 200 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం, 15 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఫస్ట్‌ రిలీజుకు నాలుగు నెలల తర్వాత రిలీజైన అనకాపల్లిలో నేరుగా 178 రోజులు ఆడి, లేట్‌ రన్‌లో ఇప్పటికీ స్టేట్‌ రికార్డుగా నిలిచి ఉంది.

click me!