Vaishnavi Chaitanya
బిగ్ బాస్ సీజన్ 7కి రంగం సిద్ధమైంది. ప్రోమోలు కూడా వచ్చేశాయి. కంటెస్టెంట్స్ ఎంపిక ఇప్పటికే ముగిసింది. అమర్ దీప్ చౌదరి, ఆయన భార్య తేజస్విని, శోభిత శెట్టి, సింగర్ మోహన భోగరాజు, దీపికా పిల్లి, బ్యాంకాక్ పిల్ల ఇలా పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అయితే బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా ఎంట్రీ ఇస్తున్నారనే న్యూస్ కాక రేపుతోంది. యూట్యూబర్ వైష్ణవి బేబీ మూవీతో టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది. ఏక కాలంలో ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడిపే అమ్మాయి పాత్ర చేసింది. అభ్యంతరకర సన్నివేశాల్లో నటించింది. బేబీ మూవీతో వైష్ణవికి బోల్డ్ ఇమేజ్ వచ్చింది.
కాబట్టి వైష్ణవి హౌస్లో అడుగుపెడితే రచ్చ రచ్చే. ఆడియన్స్ ఆమె నుండి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు. అది మేకర్స్ కి చాలా ప్లస్ అవుతుంది. అయితే సూపర్ హిట్ తో ఫార్మ్ లోకి వచ్చిన వైష్ణవి బిగ్ బాస్ హౌస్లోకి వెళుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అలాగే వైష్ణవికి బిగ్ బాస్ నిర్వాహకుల నుండి ఎలాంటి ఆఫర్ లేదని అంటున్నారు. ఫేక్ న్యూస్ అని విశ్వసనీయ వర్గాలు ఖండిస్తున్నాయి.
నిజంగా వైష్ణవి బిగ్ బాస్ షోకి ఎంపికైతే నిర్వాహకులకు చాలా ప్లస్. ఆమె కారణం ఆడియన్స్ షో పట్ల ఆసక్తి చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే వైష్ణవి బిగ్ బాస్ కి వెళుతున్నారని అధికారిక సమాచారం లేదు. కేవలం ఊహాగానాలు మాత్రమే.
ప్రస్తుతం ‘బేబీ’తో హిట్ అందుకున్న వైష్ణవి ఈ సినిమాకు మాత్రం రూ.10 లక్షల లోపు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైష్ణవి చైతన్య నటనకు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో మున్ముందు మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.
చాలా కాలం క్రితం బ్రిటన్ లో బిగ్ బ్రదర్ పేరుతో మొదలైన రియాలిటీ షో, ఇండియాలో బిగ్ బాస్ గా ప్రాచుర్యం పొందింది. సెలబ్రిటీలను నాలుగు గోడల మధ్య ఉంచి, వారి లైఫ్ స్టైల్, ఆలోచనలు, పోరాట పటిమ దగ్గరగా చూపించే బిగ్ బాస్ షో ఊహకు మించిన ఆదరణ దక్కించుకుంది.దాంతో అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది.
Bigg Boss Telugu 7
తెలుగులో 2017లో బిగ్ బాస్ షో స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్. టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా పాల్గొనడంతో పాటు ఎన్టీఆర్ హోస్టింగ్ స్కిల్స్ కిక్ ఇచ్చాయి. సీజన్ 2 నుండి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. నాని రంగంలోకి దిగారు. ఆయనకు జస్ట్ పాస్ మార్క్స్ పడ్డాయి. రేటింగ్ పరంగా ఓకే.
తనపై వచ్చిన విమర్శలకు హర్ట్ అయిన నాని మనకెందుకీ తలనొప్పని సీజన్ 3 చేయనన్నాడు. అప్పుడు నాగార్జున రంగంలోకి దిగాడు. మీలో ఎవడు కోటీశ్వరుడు షోతో నాగార్జున ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. హోస్టింగ్ లో అనుభవం ఉన్న నాగార్జున బెస్ట్ ఛాయిస్ అని మేకర్స్ నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ మూడు సీజన్స్ సక్సెస్ఫుల్ గా నడిపాడు. సీజన్ 6 విషయంలో ఫెయిల్ అయ్యాడు. వరుసగా సీజన్ 7కి కూడా ఆయనే హోస్ట్ కావడం విశేషం.