ప్రణయ్ భార్య అమృత కేసు: రామ్‌ గోపాల్‌ వర్మ `మర్డర్‌`కి బ్రేక్‌

First Published Aug 24, 2020, 2:37 PM IST

ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిన మరో కాంట్రవర్షియల్‌ మూవీ మర్డర్‌. జాతీయ స్థాయి సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రణయ్‌, అమృతల ప్రేమకథ, ఆమె తండ్రి మారుతి రావు మనో వేదన, ప్రణయ్‌ హత్య లాంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్థావించనున్నాడు.
undefined
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌ ప్రారంభించిన వర్మ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాపై అమృత ప్రణయ్‌ కుటుంబ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రణయ్‌ హత్యకే విచారణ ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటూ గతంలోనే ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఎస్సీ కోర్టును ఆశ్రయించారు.
undefined

Latest Videos

ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.
undefined
దీంతో మర్డర్‌ సినిమా రిలీజ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టైంది. మరి ఉత్తర్వులపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. లాక్‌ డౌన్‌ సినిమాలో అందరు దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుసగా తన ఏటీటీలో సినిమాలను రిలీజ్‌ చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు. అదే బాటలో మర్డర్‌ సినిమాను కూడా తన దైన స్టైల్‌లో రూపొదించాడు వర్మ.
undefined
click me!