Ram Charan- Upasana: ఉపాసన ప్రెగ్నెన్సీ... తెరపైకి కొత్త అనుమానాలు, భయపడుతున్న మెగా ఫ్యాన్స్!

Published : Dec 14, 2022, 11:28 AM IST

ఉపాసన-రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అభిమానులను సంబరాల్లో ముంచిన ఈ వార్త... కొత్త అనుమానాలకు కూడా కారణమైంది.   

PREV
17
Ram Charan- Upasana: ఉపాసన ప్రెగ్నెన్సీ... తెరపైకి కొత్త అనుమానాలు, భయపడుతున్న మెగా ఫ్యాన్స్!
Ram Charan Upasana

పదేళ్ల నిరీక్షణ... ఫైనల్ గా రామ్ చరణ్(Ram Charan)-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. 2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసన మెడలో తాళి కట్టి ఏడడుగులు వేశారు. దోమకొండ సంస్థానం వారసురాలైన ఉపాసనను రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

27
Ram Charan Upasana

రామ్ చరణ్ వివాహ బంధంలో అడుగుపెట్టి దశాబ్దం అవుతుంది. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న శుభవార్త మాత్రం ఆయన చెప్పలేదు. మెగా ఫ్యాన్స్ కి వారసుడు కావాలి. చిరంజీవి లెగసి రామ్ చరణ్ నిలబెట్టాడు.... రామ్ చరణ్ సినీ వారసత్వం ముందుకు తీసుకెళ్లే బుల్లి హీరో పుట్టాలని వారు కోరుకుంటున్నారు. 

37
Ram Charan Upasana

అయితే వేచి చూసి చూసి వేసారిపోయిన ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు. ఇక ఉపాసన(Upasana Konidela) తల్లికారంటూ పుకార్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో అనేక వదంతులు తెరపైకి వచ్చాయి. యాంటీ ఫ్యాన్స్ నుండి రామ్ చరణ్ ఈ విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు. అందరి నోళ్లు మూయించారు. 

47

అయితే వాళ్ళ ఆనందాన్ని కొన్ని అనుమానాలు పటాపంచలు చేశాయి. మరింత భయపడేలా చేస్తున్నాయి. ఉపాసన-రామ్ చరణ్ పిల్లల కోసం సరోగసీ పద్ధతి ఆశ్రయించారట. ఉపాసన గర్భం దాల్చరు. వారి బిడ్డ వేరే తల్లి గర్భంలో పెరుగుతుంది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తున్నాయి. 
 

57


సరోగసీ భారత్ లో విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది సెలెబ్రిటీలు సరోగసీ పద్దతిని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల నయనతార దంపతులు సరోగసీ పద్దతిలో ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. అదే సమయంలో విమర్శలపాలయ్యారు. 
 

67


టాలీవుడ్ లో సరోగసీ పద్దతిలో మంచు లక్ష్మి తల్లయ్యారు. మంచు లక్ష్మి అంటే పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. కాబట్టి ఈ విషయంలో ఫోకస్ కాలేదు. అలాగే ఆమె పరిస్థితుల రీత్యా సరోగసి సమర్ధించదగిన విషయమే. కానీ రామ్ చరణ్ దంపతులు సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అయ్యారని తెలిస్తే అతిపెద్ద వివాదం అవుతుంది. సాంప్రదాయవాదులు వ్యతిరేకించే కృత్రిమ పద్దతిలో తల్లిదండ్రులు కావడం అంతగా హర్షణీయం కాదు. 

77


ఉపాసన గర్భం దాల్చకుండా తల్లి అయితే  పిల్లల్ని రామ్ చరణ్ వారసులుగా చూడలేరు. అదే సమయంలో ఉపాసనపై ఉన్న కొన్ని అపవాదులు అలానే ఉండిపోతాయి. సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా మెగా ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ముందు తక్కువైపోతారు. విశాల దృక్పథం కలవారికి సరోగసీ చిన్న విషయం. కానీ తెలుగు జనాలు దీనిని లైట్ గా తీసుకునే స్థాయికి ఎదగలేదు. 

click me!

Recommended Stories