Coolie Movie Twitter Review : రఫ్ఫాడించిన రజినీకాంత్, విలన్ గా నాగార్జున మెప్పించాడా?

Published : Aug 14, 2025, 06:51 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున నెగెటీవ్ రోల్ చేసిన సినిమా కూలీ. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ పై సోషల్ మీడియాలో ఆడియన్స్ ఏమంటున్నారు? 

PREV
15

సూపర్ స్టార్ యాక్షన్ ట్రీట్

సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చిన మరో యాక్షన్ ట్రీట్ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగిటివ్ రోల్‌ చేసిన ఈసినిమాలో శృతి హాసన్, సత్య రాజ్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ యాక్టర్ సౌబిన్ షాహిర్ వంటి భారీ కాస్ట్ ఉండటంతో, కూలీ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ఎంతగానో వెయిట్ చేశారు. అనిరుధ్ అదరిపోయే మ్యూజిక్ అందించగా.. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా నేడు (ఆగస్టు 14) థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టింది కూలీ. ఇప్పటికే ఓవర్ సిస్ లో రిలీజ్ అయిన ఈ సినిమాను చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే?

25

నాగార్జున ఎంట్రీ అదుర్స్ 

30 నిమిషాలు సినిమా బాగుంది. టైటిల్ కార్డు డిజైన్ చేసిన విధానం బాగుంది, అనిరుధ్ అందించిన బీజీఎం కూడా బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ సింపుల్‌గా ఉంది. స్క్రీన్ ప్రజెన్స్ ఎలివేట్ చేసిన విధానం బాగుంది. చికిటు సాంగ్ ను కూడా బాగా డిజైన్ చేశారు. నెగెటీవ్ రోల్ లో సైమన్ పాత్రలో నాగార్జున ఎంట్రీఅదిరిపోయిందంటూ ఓ తమిళ ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. టైటిల్ కార్డుపై మరో నెటిజన్ కూడా అద్భుతం అంటూ స్పందించాడు. రజనీకాంత్ టైటిల్ కార్డును లోకేష్ కనకరాజ్ బాగా డిజైన్ చేయించాడు. దానిని బుక్ మార్క్ చేసుకోవాలనిపించేంతగా ఉందంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు, అంతే కాదు అతనికి కూలీ ఇంటర్వెల్ సీన్ బాగా నచ్చిందట.

35

డిజప్పాయింట్ చేసింది

రజినీకాంత్ కూలీ సినిమాపై అటు పాజిటీవ్ ఇటు నెగెటీవ్ రెండు రివ్యూలు వినిపిస్తున్నాయి. ఆడియన్స్ రెండు రకాలుగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. కూలీ సినిమాడిజప్పాయింట్ చేసింది. ఫస్టాఫ్ చాలా స్లోగా నడిచింది. కామెడీ కూడా చాలా పేలవంగా ఉంది. రాబోయే సీన్లు ముందే ఊహించే విధంగా ఉండటంతో అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ఫోర్సుగా ఉండే డ్రామా కారణంగా కన్ ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. అతిగా అనిపించే యాక్షన్ సీన్లు, సాగదీతగా అనిపించిన క్లైమాక్స్.. ఆడియన్స్ సహనానికి పెద్ద పరిక్షలా ఉంది ఈ సినిమా అంటూ ఓ నెటిజన్ నెగెటీవ్ గా తన అభిప్రాయం వెల్లడించారు. అతనికి ఈసినిమానచ్చలేదు.

45

1000 కోట్లు పక్కా

అసలు ఈసినిమాల్ నెగెటీవ్స్ అంటూ ఏమీ లేవు అంటున్నాడు మరో నెటిజన్. రజనీకాంత్ సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడని చెపుతూనే... సైమన్ పాత్రలో నాగార్జున విలన్‌గా గూస్ బంప్స్ తెప్పించాడు, గెస్ట్ రోల్ లో అమీర్ ఖాన్ అదరగొట్టాడు, యాక్షన్ సీన్లకు అనిరుధ్ బీజీఎం మామూలుగా లేదు.. అది నెక్ట్స్ లెవెల్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అయితే చెప్పడానికి రావడంలేదు.. ఇక కూలీ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరే మొదటి తమిళ మూవీగా నిలవబోతోంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

55

బ్లాక్ టికెట్స్ కోసం క్యూ

కూలీ సినిమా క్రేజ్ మామూలుగా లేదు, చెన్నైలో ఈసినిమా టికెట్ల కోసం జనాలు కొట్టుకుంటున్నారు. రజినీకాంత్ క్రేజ్ ను ఆపడం ఎవరి తరం కాదు.. కూలీ సినిమా టికెట్లు బ్లాక్ లో 4500 కు కొంటున్నారు. దానికి కూడా పోటీ కనిపిస్తోంది. క్యూ కట్టి మరీ బ్లాక్ లో టికెట్స్ కొంటున్నారంటూ నెటిజన్ ఒకరు కామెంట్ చేశారు. ఇక మరో యూజర్ అయితే కూలీ సినిమా చూశాను. స్క్రిప్ట్ బాగా రాశారు. స్క్రీన్ ప్లే స్పీడ్‌గా సాగడంతో సన్నివేశాలు వేగంగా దూసుకెళ్తాయి. మాస్ సన్నివేశాలు బాగున్నాయి. మంచి లాజిక్‌తో ట్విస్ట్ రివీల్ చేసిన తీరు ఆకట్టుకొన్నేలా ఉంది అని కామెంట్ చేశాడు. ఇలా సినిమా చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ఇక థియేటర్లలో కూలీ సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఈమూవీ నిజంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories