అజిత్ సినిమాపై 127 కోట్లు కేసు, కాపీ ఇంత ప్రమాదమా?

Published : Dec 03, 2024, 08:58 AM IST

పారామౌంట్ పిక్చర్స్ లైకా ప్రొడక్షన్స్‌కి 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 127 కోట్లు) పరిహారం డిమాండ్ చేస్తూ నోటీసు పంపింది. "విదాముయార్చి" టీమ్ కానీ నిర్మాతలు కానీ  ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు లేదా స్పందించలేదు.

PREV
16
 అజిత్ సినిమాపై  127 కోట్లు కేసు, కాపీ ఇంత ప్రమాదమా?
Ajith Kumar movie Vidaamuyarchi Teaser

తమిళ  స్టార్‌ హీరో అజిత్‌ కుమార్ తెలుగుతో సహా తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. AK 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆరవ్, అర్జున్, రెజీనా, సంజయ్‌ దత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.  అయితే అదే సమయంలో ఈ సినిమా లీగల్ వివాదంలో ఇరుక్కుందని తమిళ సిని వర్గాల సమాచారం. 

26
Vidaamuyarchi Ajith


రీసెంట్ గా అజిత్ తన నెక్ట్స్ ప్రాజెక్టు  "విదాముయార్చి" షూటింగ్ దాదాపు పూర్తిచేసుకున్నారు, మరియు ఇటీవలి రోజుల్లో టీజర్ విడుదలైంది. ఈ చిత్రం 2025 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే, అదేసమయంలో  "విదాముయార్చి" 1997లో విడుదలైన హాలీవుడ్ చిత్రం "బ్రేక్‌డౌన్" అనఫిషియల్ రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.  టీజర్ విజువల్స్ కూడా అలాగే ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఆ హాలీవుడ్ నిర్మాణ సంస్ద తమ రైట్స్ నిమిత్తం డబ్బులు కట్టమంటూ రంగంలోకి దూకింది.

36
Vidaamuyarchi


ఈ సినిమా రోడ్ థ్రిల్లర్‌గా జోనాథన్ మోస్టోవ్ దర్శకత్వంలో తెరకెక్కింది, ఇందులో కర్ట్ రస్సెల్ ప్రధాన పాత్రలో నటించారు. కానీ, "విదాముయార్చి" చిత్ర నిర్మాతలు "బ్రేక్‌డౌన్" రీమేక్ హక్కులను అధికారికంగా కొనుగోలు చేయలేదని తెలుస్తోంది.

తమిళ మీడియా నుండి వచ్చిన వార్తల ప్రకారం, "విదాముయార్చి" టీమ్ కి  కాపీ రైట్స్  ఉల్లంఘనపై లీగల్ నోటీసులు అందాయి. పారామౌంట్ పిక్చర్స్ లైకా ప్రొడక్షన్స్‌కి 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 127 కోట్లు) పరిహారం డిమాండ్ చేస్తూ నోటీసు పంపింది. "విదాముయార్చి" టీమ్ కానీ నిర్మాతలు కానీ  ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు లేదా స్పందించలేదు.

46
Ajith Kumar starrer Vidaamuyarchi film updates out


ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే "బ్రేక్‌డౌన్" సినిమాతో కొన్ని పోలికలు ఉన్నట్లు అనిపిస్తోంది. మగిల్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో చాలా భాగం అజర్‌బైజాన్‌లో చిత్రీకరించబడింది, అక్కడి లొకేషన్లతో కథకు అనుకూలంగా ఉండేలా చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లో త్రిష, అర్జున్ సర్జా, రెజీనా ఇతర ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.

56
Ajith Kumar Vidaamuyarchi


 విదాముయార్చి టీజర్‌  విషయానికి వస్తే...ఒక నిమిషం 48 సెకండ్ల నిడివి గల టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. మేకర్స్ టీజర్‌ను ఫుల్ యాక్షన్‌తో రిలీజ్ చేశారు. సినిమాలో నటించిన అందరి యాక్టర్లపై వచ్చే సీన్స్ తో టీజర్‌ కట్ చేసి.. సినిమాలో ఏదో మిస్టీరియస్ ఎలిమెంట్‌ ఉందని హింట్ ఇచ్చారు. అజిత్ ఎవరి కోసమో వెతుకున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాను సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌కటించారు.ఇక విదాముయార్చి టీజర్‌లో డైలాగ్స్‌ లేకున్నా.. అద్భుతంగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.

66


 అజిత్ తన యాక్షన్‌, యాక్టింగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇందులో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా.. ఓం ప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఉన్నారు. విడాముయ‌ర్చి సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా.. ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. ఇక సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories