తెనాలిలో పుట్టి పెరిగిన సీనియర్ నటి ప్రభ ఎన్నో దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె రాణించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశం ఆమెకి దక్కింది. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలసి దాన వీర శూర కర్ణ చిత్రంలో నటిచడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని నటి ప్రభ అన్నారు.