హీరోయిన్లకు కోట్లల్లో లాభాలు కురిపిస్తున్న ఓయో హోటల్స్, మహేష్ హీరోయిన్ కూడా.. ఎవరెవరు ఎంత మొత్తం అంటే

First Published | Jan 16, 2025, 4:06 PM IST

హోటల్ రంగంలో ఓయో సంస్థ గత కొన్నేళ్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓయో సంస్థ వందల కోట్ల బిజినెస్ గా మారిపోయింది. లాభాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతుంటాయి. 

హోటల్ రంగంలో ఓయో సంస్థ గత కొన్నేళ్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓయో సంస్థ వందల కోట్ల బిజినెస్ గా మారిపోయింది. లాభాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతుంటాయి. ఓయో హోటల్ రంగంలో వస్తున్న లాభాలు చూసి సెలెబ్రిటీలు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు. 

సెలెబ్రిటీలు చాలా మంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒకవైపు సినిమా రంగంలో రాణిస్తూనే మరోవైపు వ్యాపారాల్లో సైతం లాభాలు పొందుతున్న సినీతారలు ఉన్నారు. ఓయో హోటల్స్ లో అద్భుతమైన రిటర్న్స్  వస్తుండడంతో చాలా మంది హీరోయిన్లు ఈ సంస్థలో షేర్లు కొంటున్నారట. ఈ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 


80, 90 దశకాలలో భారత చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన మాధురి దీక్షిత్ ఓయో హోటల్స్ లో భారీ మొత్తంలో షేర్లు కొన్నారట. తన భర్త శ్రీరామ్ నేనేతో కలసి ఆమె ఏకంగా 2 మిలియన్ల షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. ఓయో సంస్థకి వస్తున్న లాభాలతో మాధురి దీక్షిత్ ఇంత భారీ మొత్తంలో షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సతీమణి గౌరి ఖాన్ డిజైనర్ గా రాణిస్తూనే వ్యాపారాల్లో సైతం బిజీగా ఉన్నారు. ఆమె ఓయో సంస్థలో ఏకంగా 2.4 మిలియన్ల షేర్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఓయో జి ఫండింగ్ రౌండ్ లో భాగంగా గౌరి ఖాన్ ఈ షేర్లు సొంతం చేసుకున్నారట. 

ఇక ఓయోలో ఇన్వెస్ట్ చేసిన మరో హీరోయిన్ అమృత రావు. అమృత రావు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో నటించింది. అమృతరావు తన భర్త ఆర్జే అన్మోల్ తో కలసి ఓయోలో షేర్లు కొన్నారట. మరికొందరు సెలెబ్రిటీలు కూడా ఓయో షేర్లు దక్కించుకునేందుకు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

click me!