కృతి శెట్టి మొదటి చిత్రం సూపర్ 30. హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో కృతి స్టూడెంట్ రోల్ చేసింది. ఉప్పెన మూవీతో పూర్తి స్థాయి హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.