ప్రముఖ హాస్యనటుడు గౌండమణి భార్య శాంతి అనారోగ్య కారణంగా ఈరోజు ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకుని కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గౌండమణిని పరామరశ్శిస్తున్నారు.
తమిళ, తెలుగు సినీ అభిమానులకు హాస్యనటుడిగా గౌండమణి సుపరిచితులు. 80, 90 దశకాల్లో ఆయన హాస్యాన్ని చూసేందుకే చాలామంది థియేటర్లకు వచ్చేవారు. సెంథిల్ - గౌండమణి కాంబినేషన్ కామెడీకి విశేష ఆదరణ లభించింది.
25
కామెడీ దిగ్గజం గౌండమణి
ఇప్పటికీ 90ల తరం వారు గౌండమణి, సెంథిల్ కామెడీని చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఒకప్పుడు హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న గౌండమణి, 1970లో 'రామన్ ఎందన్ రామనాడి' సినిమాతో తెరంగేట్రం చేశారు. అవకాశాల కోసం దర్శకనిర్మాతల ఇంటి ముందు నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
35
గౌండమణి కోసం పోరాడిన భాగ్యరాజ్
భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'మూడు ముడి సినిమాలో గౌండమణిని నటింపచేయడానికి భారతీరాజా నిరాకరించగా, భాగ్యరాజ్ తన ఊరి వాడనే ఉద్దేశంతో ఆయనను సినిమాలో నటింపజేయాలని పట్టుబట్టారు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
ప్రేమ జంటలకు సహాయం చేసే పాత్రల్లో నటించిన గౌండమణి, నిజ జీవితంలో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1963లో వీరి వివాహం జరిగింది. గౌండమణికి ఇద్దరు కుమార్తెలు - సెల్వి, సుమిత్ర. తన కుటుంబం మీడియాలో కనిపించడం ఇష్టం లేని గౌండమణి, కూతుళ్లకు మంచి చదువు చెప్పించి పెళ్లిళ్లు చేశారు. కుటుంబ సభ్యులు సినిమా కార్యక్రమాలకు హాజరు కావడానికి అనుమతించలేదు.
55
గౌండమణి భార్య శాంతి మృతి
గౌండమణి భార్య శాంతి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం 10:30 గంటలకు మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని అంతిమ దర్శనానికి తేనాంపేటలోని ఆమె ఇంట్లో ఉంచారు. శాంతి వయసు 67 సంవత్సరాలు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.