Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్

Published : Sep 29, 2026, 03:39 PM IST

టాలీవుడ్ లో ఓ క్రేజీ కమెడియన్ సినిమాల్లోకి రాకముందు రోజుకు 150 రూపాయలు సంపాదించేవారట. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్ కి కనీసం గౌరవం ఇవ్వకుండా తాను ఎలా బిహేవ్ చేశాను అనేది రివీల్ చేశారు.

PREV
15
Venu Madhav

దివంగత కమెడియన్ వేణు మాధవ్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో వేణు మాధవ్ కడుపుబ్బా నవ్వించారు. కొన్ని కామెడీ సినిమాల్లో హీరోగా కూడా చేశారు. కమెడియన్ కాకముందు వేణు మాధవ్ మిమిక్రి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. తెలుగు దేశం పార్టీ ఆఫీస్ లో ఎన్టీఆర్ వద్ద ఉద్యోగం కూడా చేశారు.

25
కట్టల కట్టల డబ్బు వస్తుంది అనుకుంటే..

1996లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంప్రదాయం మూవీతో వేణు మాధవ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. వేణు మాధవ్ కమెడియన్ కావడం వెనుక ఆసక్తికర స్టోరీ ఉంది. ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ ఆ విషయాలని బయటపెట్టారు. ఎన్టీఆర్ గారి ఆఫీస్ లో ఉద్యోగం అంటే కట్టలు కట్టలు డబ్బు వస్తుంది అని అనుకున్నా. నెలరోజులు జీతం కోసం ఎదురు చూస్తుంటే 600 వందలు ఇచ్చారు. అక్కడ నేను టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేశాను.

35
మిమిక్రి చేస్తుంటే ఎస్వీ కృషారెడ్డి గారు

ఒక ప్రోగ్రాంలో మిమిక్రీ చేస్తుంటే ఎస్వీ కృష్ణారెడ్డి గారు నన్ను చూశారు. ఈ సంఘటన 1995లో జరిగింది. ప్రోగ్రాం అయ్యాక నువ్వు సినిమాల్లో నటిస్తే బావుంటుంది అయ్యా అని అన్నారు. నాకు ఇంట్రస్ట్ లేదు. ఒకసారి నన్ను ఆఫీస్ కి వచ్చి కలువు అని చెప్పారు. అబ్బా వీళ్ళు నన్ను వదిలేలా లేరు కదా అని ఆయన ఆఫీస్ కి వెళ్ళాను.

45
యాక్టింగ్ మనవల్ల కాదు

ఎలాగైనా వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అనుకున్నా. కృష్ణారెడ్డి గారు రాగానే అన్నా ఇదంతా షూటింగ్స్, యాక్టింగ్ మనకు తెలియదు. స్టేజీ షోలు అయితే చేస్తా కానీ యాక్టింగ్ మనవల్ల కాదు అని చెప్పా. లేదు దాని గురించి నువ్వు ఆలోచించకు మేము చెబుతాము. షూటింగ్ కి నీ డేట్లు 35 రోజులు కావాలి అని అడిగారు. వీళ్ళు వదిలేలా లేరు అని చివరి అస్త్రం ప్రయోగించా.

55
70 వేలు డిమాండ్ చేశా

అప్పుడు నాకు మిమిక్రి ప్రోగ్రాంకి రోజుకు 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నేను ఎస్వీ కృష్ణ రెడ్డి గారిని ఏకంగా 2000 ఇస్తా వస్తా లేకుంటే రాను అని చెప్పా. అది కూడా ఎలా చెప్పాను అంటే కుర్చీలో వెనక్కు వాలుకుని కూర్చుని కాలుమీద కాలు వేసుకుని చెప్పా. ఇంకొకరు అయి ఉంటే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారికి కోపం రాదు. కోపం అంటే ఆయనకు తెలియదు. రోజు 2000, 35 రోజులు కాబట్టి 70000 ఇవ్వాలి అని అడిగితే అలాగే అండీ ఇస్తాం అని అన్నారు. ఆ విధంగా సంప్రదాయం చిత్రంతో నటుడిగా తొలి అవకాశం లభించింది. అది నాకు మరో జన్మ అని వేణు మాధవ్ గుర్తు చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories