Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?

Published : Sep 29, 2026, 01:45 PM IST

Udaya Bhanu: దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగువారి మనసు గెలుచుకున్న యాంకర్ ఉదయభాను. రీసెంట్ గా నిర్మాతగా మారింది స్టార్ యాంకర్. ఉదయభాను గురించి అందరికి తెలుసు.. కానీ ఆమె తల్లిదండ్రుల గురించి ఎంత మందికి తెలుసు.

PREV
15
బుల్లితెరపై వెలుగు వెలిగిన యాంకర్..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను. తెలుగులో పదుల సంఖ్యలో టీవీ కార్యక్రమాలు చేసి.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఉదయభాను. కొంత కాలం ఆమె తెరపై అస్సలు కనిపించలేదు. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. పెద్దగా యాక్టీవ్ అవ్వలేదు. రీసెంట్ గా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు భాను. అంతే కాదు తన కెరీర్ గురించి, తనపై కుట్రలు చేసిన వారి గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. ఉదయభాను గురించి చాలావరకు అందరికి తెలిసిందే. కానీ ఆమె ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు.

25
తండ్రి గురించి చెప్పి ఎమోషనల్ అయిన ఉదయ భాను

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చాలా విషయాలు పంచుకున్నారు ఉదయభాను. స్టార్ యాంకర్ చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి. జమీందారీ కుటుంబంలో జన్మించిన తన తండ్రి, తనకున్న కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని ఊరి ప్రజల కోసం దానం చేశారన్న విషయాన్ని చెప్పి.. ఉదయభాను ఎంతో గర్వపడ్డారు.

35
నాన్న ప్రేమతో పెట్టిన పేరు..

ఉదయభాను తండ్రి ఎస్.కే. పటేల్ ఒక కవి, రచయిత, ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి. ఆయన కవిత్వంలో 'ఉదయభాను' అనే కలం పేరుతో కవితలు రాసేవారు. విప్లవాత్మక భావజాలం కలిగిన ఆయన, నాటి సమాజంలో దొరల పెత్తనాన్ని, సామాజిక అసమానతలను నిరసిస్తూ కవితలు, కథలు రాసేవారు. తన కలం పేరునే ముచ్చటపడి తన కుమార్తెకు పేరుగా పెట్టారు.

ఉదయభాను ఐదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, ఊరి ప్రజలు ఆయన గురించి చెప్పిన విషయాల ద్వారానే తన తండ్రి గొప్పతనాన్ని ఆమె తెలుసుకున్నారు. తండ్రి మరణం తర్వాత తనను తన తల్లి ఎంతో కష్టపడి పెంచిందని.. ఆమె కూడా విప్లవ పాటలు రాసేవారని ఉదయభాను అన్నారు. అదే అలవాటు తనకు కూడా వచ్చిందని ఓ విప్లవ కవిత్వంతో తన టాలెంట్ చూపించారు భాను.

45
150 ఎకరాల ఆస్తిని ఊరికి దానం చేసిన మహనీయుడు

ఉదయభాను తండ్రి పెద్ద జమీందారీ కుటుంబానికి చెందినవారు. ఆయన వద్ద దాదాపు 150 ఎకరాలకు పైగా సొంత భూమి ఉండేది. అయితే స్వార్థం, ఆస్తి వ్యామోహం లేని ఆయన, తన విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు బాగుండాలని ఆ భూమి మొత్తాన్ని ఊరి ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం ఉచితంగా దానం చేశారు. కోహెడ పరిసర ప్రాంతాల్లో ఆయన చేసిన ఈ త్యాగాన్ని ఊరి ప్రజలు ఇప్పటికీ మరువలేదు. అక్కడ ఆయన జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

55
పైసా ఆస్తి ఆశించని కుటుంబం

తన తండ్రి అంత పెద్ద జమీందార్ అయినప్పటికీ, ఆయన దానం చేసిన ఆస్తి నుంచి తమ కుటుంబం ఒక్క రూపాయి లేదా ఒక్క సెంటు భూమిని కూడా ఆశించలేదని ఉదయభాను స్పష్టం చేశారు. "మా నాన్నగారు మిగిల్చిన ఆస్తి కంటే, ఆయన సంపాదించిన మంచితనం, ప్రజల్లో సంపాదించుకున్న ఆదరాభిమానాలే మాకు నిజమైన ఆస్తి" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.

సమాజంలో ప్రతి చిన్న ఆస్తి కోసం తగాదాలు పడే ఈ రోజుల్లో, కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని ఊరికి రాసిచ్చిన ఉదయభాను తండ్రి త్యాగం నేటి తరానికి ఎంతో ఆదర్శం.

Read more Photos on
click me!

Recommended Stories