Sunil
కమెడియన్ గా గుర్తింపు వచ్చాక హీరో కావడం సాధారణ విషయం కాదు. కానీ సునీలీ అది చేసి చూపించాడు. కమెడియన్ గా సునీల్ కి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. హీరోగా కూడా సునీల్ కెరీర్ ఆరంభం అదిరింది. కానీ ఆ తర్వాత ట్రాక్ తప్పింది. సునీల్ హీరోగా మర్యాద రామన్న, పూలరంగడు, అందాల రాముడు, మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సునీల్ ని ఫ్లాప్ మూవీస్ వెంటాడాయి.
సునీల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటి వరకు సునీల్ కి కారు లేదు. స్టార్ కమెడియన్ అయ్యాక కారు కొనాలని అనిపించిందట. ఎలాంటి కారు కొంటే బావుంటుంది.. ఎవరినైనా సలహా తీసుకుందాం అనుకున్నాడట. తన బడ్జెట్ కి తగ్గట్లుగా ఐ 10 కారు కొనాలని అనుకున్నాడు. ప్రముఖ నిర్మాత, హీరో రామ్ పోతినేని పెదనాన్న అయిన స్రవంతి రవి కిషోర్ కి ఈ విషయం చెప్పారట. సార్ నేను ఐ 10 కారు కొనాలని అనుకుంటున్నా అని చెప్పారట.
స్రవంతి రవికిశోర్ వెంటనే.. ఐ 10 కొంటావా.. ఆటో కొనేసుకో బావుంటుంది అని వెటకారంగా అన్నారట. అదేంటి సార్ అని అడిగితే.. ఆయన ఇచ్చిన సమాధానం విని సునీల్ షాక్ అయ్యాడు. నీది మామూలు పర్సనాలిటీ కాదు(అప్పట్లో సునీల్ బాగా బొద్దుగా ఉండేవారు).. కనీసం సీటు దగ్గర నీ కాళ్ళు కూడా సరిగ్గా పట్టవు ఐ 10 కారులో.. దానికన్నా ఆటో సౌకర్యంగా ఉంటుంది అని చెప్పారట. పైగా నువ్వు ఏదో ఒక లగేజ్ తో తిరుగుతుంటావు. కాబట్టి ఐ10 వద్దు.. కాస్త డబ్బు ఎక్కువైనా మంచి కారు కొనుక్కో అని చెప్పారట. ఆయన సలహా మేరకు సునీల్ హుండాయ్ ఎక్సెంట్ టొర్నాడో అనే కారు కొనుక్కున్నారు. తాను కొనుక్కున్న ఫస్ట్ కారు అదే అని సునీల్ తెలిపారు.
సునీల్, త్రివిక్రమ్, స్రవంతి రవికిశోర్ మధ్య మంచి అనుబంధం ఉంది. స్రవంతి రవికిశోర్ చిత్రాల ద్వారానే త్రివిక్రమ్, సునీల్ ఇద్దరికీ లైఫ్ వచ్చింది. నువ్వే కావాలి, నువ్వు నాకు, నచ్చావ్, నువ్వే నువ్వే ఇలా స్రవంతి రవికిశోర్ నిర్మించిన అనేక చిత్రాల్లో సునీల్ నటించారు. నువ్వే నువ్వే, ఆంధ్రుడు, మర్యాద రామన్న చిత్రాలకు సునీల్ నంది అవార్డులు గెలుచుకున్నారు. అనేక ఫిలిం ఫేర్ అవార్డులు కూడా లభించాయి.