Vishwak Sen: తెగించిన రాహుల్ రామకృష్ణ.. విశ్వక్ సేన్ వివాదంపై బోల్డ్ కామెంట్

Published : May 05, 2022, 09:45 AM IST

సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేరారు. 

PREV
16
Vishwak Sen: తెగించిన రాహుల్ రామకృష్ణ.. విశ్వక్ సేన్ వివాదంపై బోల్డ్ కామెంట్
Vishwak Sen

యంగ్ హీరో విశ్వక్ సేన్, ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ దేవి నాగవల్లి మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్ కోసం.. సినిమా అభిమానిగా పాపులర్ అయిన లక్ష్మణ్ తో రోడ్డుపై ఫ్రాంక్ చేయించాడు. నడిరోడ్డుపై న్యూసెన్స్ కావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. 

26

ఆ తర్వాత విశ్వక్ సేన్ ప్రముఖ ఛానల్ డిబేట్ కి వెళ్లడం.. అక్కడ యాంకర్ దేవి నాగవల్లితో జరిగిన గొడవ.. వ్యవహారాలన్నీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కొందరు దేవి నాగవల్లికి సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విశ్వక్ సేన్ కి మద్దతు తెలుపుతున్నారు. సదరు టివి ఛానల్ అసలైన అంశాల్ని పక్కన పెట్టి టిఆర్పి కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తోంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

36

సదరు ఛానల్ గతంలో చేసిన ఫ్రాంక్ వీడియోల్ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ కి మద్దతు పెరుగుతోంది. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేరారు. 

46
Vishwak Sen

ఒక బోల్డ్ కామెంట్ తో సదరు టివి ఛానల్ ని రాహుల్ రామకృష్ణ తీవ్రంగా తప్పు బట్టాడు. సెలెబ్రిటీ హోదాలో ఉంది ఇలా న్యూస్ ఛానల్ కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ పని రాహుల్ రామకృష్ణ చేయడంతో ఊహించని సర్ ప్రైజ్ గా మారింది. 

56

సదరు టివి ఛానల్ పేరు ప్రస్తావిస్తూ.. 'మీకు అసలు సిగ్గు ఉందా' అంటూ బోల్డ్ కామెంట్ పోస్ట్ చేశాడు రాహుల్ రామకృష్ణ. రాహుల్ రామకృష్ణ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 

66

ఓ అభిమాని.. అన్నా మీరు వాళ్లకి వ్యతిరేకంగా ట్వీట్ వేశారు. రాంచరణ్ తరిమేటప్పుడు మీరు సరిగ్గా పరిగెత్తలేదని.. అందువల్లే 2000 కోట్లు రావాల్సిన ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ 1000 కోట్ల వద్దే ఆగిపోయాయి అని వేసినా వేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories