అభిమానులు 30 ఇయర్స్ పృథ్వీ అని పిలిస్తే సంతోషమా లేక పృథ్వీ రాజ్ అని పిలిస్తేనా అని ప్రశ్నించగా.. 30 ఇయర్స్ పృథ్వీ అనే సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే అది నాకు ఇండస్ట్రీలో గుర్తింపు నిచ్చిన మ్యాజరిజం అని పృథ్వీ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి కూడా పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా బాస్ పవన్ కళ్యాణ్ లాగే ఇండస్ట్రీని, పాలిటిక్స్ ని బ్యాలెన్స్ చేస్తా అని చెప్పారు.